Rohit Sharma- Virat Kohli: కోహ్లీ, రోహిత్‌ల‌కు బీసీసీఐ స్పెషల్ ట్రీట్.. వారి పేరు మీద విమానం..!

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Rohit Sharma- Virat Kohli) టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజయం త‌ర్వాత టీ20ల‌కు గుడ్ బై చెప్పిన విష‌యం తెలిసిందే.

  • Written By:
  • Updated On - July 4, 2024 / 05:30 PM IST

Rohit Sharma- Virat Kohli: టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Rohit Sharma- Virat Kohli) టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజయం త‌ర్వాత టీ20ల‌కు గుడ్ బై చెప్పిన విష‌యం తెలిసిందే. యువ ఆట‌గాళ్ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌నే ఉద్దేశంతో టీ20 టోర్నీ నుంచి నిష్క్ర‌మిస్తున్న‌ట్లు ఈ ఇద్ద‌రు ఆట‌గాళ్లు వేరు వేరు సంద‌ర్భాల్లో చెప్పుకొచ్చారు. ముందుగా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌గా.. ఆ త‌ర్వాత ప్రెస్ మీట్‌లో ఇక‌పై టీ20ల‌కు స్వ‌స్తి చెబుతున్న‌ట్లు రోహిత్ శ‌ర్మ అభిమానుల‌కు తెలియ‌జేశాడు. దీంతో ఈ ఆట‌గాళ్ల అభిమానులు తీవ్ర నిరాశ‌కు లోన‌య్యారు. అయితే విరాట్, రోహిత్ టీ20ల‌కు గుడ్ బై చెప్పిన మ‌రుస‌టి రోజే టీమిండియా ఆల్ రౌండ‌ర్ జ‌డేజా సైతం టీ20ల‌కు గుడ్ బై చెబుతూ అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురిచేశాడు.

అయితే టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన విరాట్‌, రోహిత్‌ల‌కు బీసీసీఐ ఓ ప్ర‌త్యేక కానుక ఇచ్చింది. టీమ్ఇండియా ప్లేయర్లు ఢిల్లీ నుంచి ముంబై‌కి ప్రయాణించే విస్తారా విమానానికి వారి జెర్సీ నంబర్లు (కోహ్లీ 18, రోహిత్ 45) ఉండేలా ‘UK1845’ నంబర్ కేటాయించింది. ఇలా ఈ విమానాన్ని వారిద్దరికి అంకితం చేసింది. కాగా ముంబైకి చేరుకున్న తర్వాత టీమ్ఇండియా ప్లేయర్లు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఓపెన్ బస్ పరేడ్‌లో పాల్గొంటారు. అయితే వీరిద్దరూ టీ20ల్లో టీమిండియా త‌ర‌పున అనేక రికార్డులు క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే.

Also Read: India Cricket Team: బార్బడోస్ నుంచి భార‌త్‌కు 16 గంట‌లు జ‌ర్నీ.. టీమిండియా ఆట‌గాళ్లు ఏం చేశారంటే..?

ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 2:55 గంటలకు బయలుదేరిన విమానం సాయంత్రం 5:20 గంటలకు ముంబైలో దిగాల్సి ఉంది. విస్తారా విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయంలోని టెర్మినల్ 2లో ల్యాండ్ అవుతుంది. ఎయిర్ ఇండియా చార్టర్డ్ విమానం బార్బడోస్ లోనే నిలిచిపోయిన‌ భారత జట్టును, స‌హాయ‌క సిబ్బందిని ఈరోజు ఉద‌యం భార‌త్‌కు తీసుకువచ్చింది. 16 గంటల సుదీర్ఘ విమాన ప్ర‌యాణం తర్వాత టీ20 ప్రపంచక‌ప్‌ ఛాంపియన్లు జూలై 4 తెల్లవారుజామున భారత గడ్డ మీద అడుగుపెట్టారు.

We’re now on WhatsApp : Click to Join

ఈ క్ర‌మంలోనే ఉద‌యం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఛాంపియన్‌ జట్టుకు అభిమానుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. రోహిత్ శర్మ T20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని ఎత్తిచూపాడు. ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌కు వెళ్లిన బృందం కేక్‌ కట్‌ చేసి వేడుకలు జ‌రుపుకుంది. అనంత‌రం లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని పిఎం మోడీ నివాసానికి వెళ్లారు. అక్క‌డ బ్రేక్ ఫాస్ట్ చేసి ప్ర‌ధానితో చ‌ర్చించారు.