Rohit-Virat Fight: రోహిత్, కోహ్లీ మధ్య గొడవలు నిజమే.. బయటపెట్టిన మాజీ కోచ్..!

ఒకవైపు విరాట్ కోహ్లీ (Virat Kohli) తన దూకుడు శైలికి పేరుగాంచగా, అతనితో పోలిస్తే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) చాలా ప్రశాంతమైన ఆటగాడు. ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరుగుతుందో ఊహించలేం. అయితే ఓ పుస్తకంలోని విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ వివాదం ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య మాత్రమే జరిగింది.

  • Written By:
  • Publish Date - February 5, 2023 / 06:50 AM IST

ఒకవైపు విరాట్ కోహ్లీ (Virat Kohli) తన దూకుడు శైలికి పేరుగాంచగా, అతనితో పోలిస్తే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) చాలా ప్రశాంతమైన ఆటగాడు. ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరుగుతుందో ఊహించలేం. అయితే ఓ పుస్తకంలోని విషయాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ వివాదం ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య మాత్రమే జరిగింది. ఈ వివాదం బాగా పెరిగిపోవడంతో అప్పటి ప్రధాన కోచ్ రవిశాస్త్రి జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని సమాచారం. కోహ్లీ-రోహిత్ మధ్య గొడవలు జరిగాయి. కోహ్లీ షేర్ చేసే ఫొటోల్లో రోహిత్ ఉండేవాడు కాదు. రోహిత్ పోస్ట్ చేసే ఫొటోల్లో కోహ్లీ కనిపించేవాడు కాదు. ఇద్దరూ ఇన్ స్టాలోనూ అన్ ఫాలో చేసుకోవడంతో ఫ్యాన్స్ మధ్య గుసగుసలు స్టార్ట్ అయ్యాయి.

2019 ప్రపంచకప్ అనంతరం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య గొడవలు మొదలయ్యాయని అప్పట్లో వార్తలు తెగ హల్చల్ చేశాయి. వాటికి బలం చేకూరుస్తూ సోషల్ మీడియాలో ఈ స్టార్లిద్దరూ ఒకరిని మరొకరు అన్​ ఫాలో చేసుకున్నారు. ఇదే విషయంపై భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ తన ఆటో బయాగ్రఫీలో రాసుకొచ్చాడు. వారిద్దరి మధ్య గొడవలు జరిగింది నిజమే అని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ తన కోచింగ్ బియాండ్ పుస్తకంలో పేర్కొన్నాడు.

Also Read: Ashwin Reacts: స్మిత్ కామెంట్స్ కు అశ్విన్ కౌంటర్

2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు డ్రెస్సింగ్ రూం గురించి చాలా డిస్కషన్ జరిగింది. రోహిత్, కోహ్లీ.. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో అయ్యారు. రెండు సెపరేట్ గ్రూపులు కూడా ఉండేవి. విండీస్ తో టీ20 సిరీస్ కోసం యూఎస్ వెళ్లాం. అక్కడికి వెళ్లగానే.. కోహ్లీ, రోహిత్ శర్మను కోచ్ రవిశాస్త్రి తన గదికి పిలిపించుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవలకు పుల్ స్టాప్ పెట్టాలని కోహ్లీ-రోహిత్ ఇద్దరికీ కూడా రవిశాస్త్రి చెప్పాడు. మీరు ఇద్దరూ టీమ్ లో సీనియర్స్, మీరిద్దరూ జట్టులోకి మిగిలిన క్రికెటర్లకు రోల్ మోడల్ గా ఉండాలని రవిశాస్త్రి తేల్చి చెప్పేశాడు. ఆ తర్వాత ఇద్దరిలోనూ మార్పు కనిపించిందని మాజీ కోచ్ ఆర్.శ్రీధర్ కోచింగ్ బియాండ్ పుస్తకంలో చెప్పుకొచ్చాడు.