Site icon HashtagU Telugu

Rohit Sharma: రోహిత్ శర్మ ODI ప్రపంచ కప్ 2027 ఆడ‌తాడా?

T20I Record

T20I Record

Rohit Sharma: తాజాగా న్యూజిలాండ్‌ను ఓడించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది టీమిండియా. ఈ టోర్నీకి ముందు రోహిత్ శర్మ (Rohit Sharma) గురించి చాలా ఊహాగానాలు వచ్చాయి. ఈ టోర్నమెంట్ తర్వాత రోహిత్ వన్డే క్రికెట్ నుండి కూడా రిటైర్ కావచ్చని క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. కానీ టైటిల్ గెలిచిన తర్వాత రోహిత్ తాను వన్డే క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకోవడం లేదని స్పష్టం చేశాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇప్పుడు 2 ఐసీసీ టైటిల్స్ గెలుచుకున్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌ 2024 టైటిల్‌ను టీమిండియా గెలుచుకుంది.

ఇంటర్వ్యూలో రోహిత్ సమాధానమిచ్చాడు

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత స్టార్ స్పోర్ట్స్‌లో రోహిత్ శర్మ ఇంటర్వ్యూ వెలువడింది. ఇందులో రోహిత్ తన భవిష్యత్ ప్రణాళికల గురించి ఇంకా ముందుకు ఆలోచించడం లేదని చెప్పాడు. నేను 2027 వన్డే ప్రపంచకప్ ఆడతానో లేదో ఇప్పుడే ఏమీ చెప్పదలచుకోలేదు. ఇప్ప‌టి నుంచి ఇవన్నీ చెప్పడం సరికాదు. నా కెరీర్‌లో ఇప్పటి వరకు ఎప్పుడూ ఆలోచించలేదు. నేను ఎలా ఆడుతున్నానో ఇప్పుడే చూస్తున్నాను. నా మనస్తత్వం ఏమిటి? ప్రస్తుతం నేను నా ఆటతో సంతోషంగా ఉన్నాను. జట్టు సహవాసాన్ని ఆస్వాదిస్తున్నాను అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

Also Read: Currency Notes: ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం.. త్వ‌ర‌లో కొత్త రూ. 100, 200 నోట్లు విడుద‌ల‌

ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు

ఛాంపియన్స్ ట్రోఫీ చివరి మ్యాచ్ మార్చి 9న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా విజయంలో రోహిత్‌ ఈ ఇన్నింగ్స్‌ కీలక పాత్ర పోషించింది. రోహిత్ తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా కూడా ఎంపికయ్యాడు.

రోహిత్‌ ఐపీఎల్‌లో ఆడుతూ కనిపించనున్నాడు

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇప్పుడు టీమ్ ఇండియా ఆటగాళ్లందరూ ఐపీఎల్ 2025లో ఆడుతున్నారు. రోహిత్ శర్మ మరోసారి ముంబై ఇండియన్స్ తరఫున ఆడనున్నాడు. జట్టు కమాండ్ మరోసారి హార్దిక్ పాండ్యా చేతుల్లోకి వస్తుంది. కానీ హార్దిక్ మొదటి మ్యాచ్ ఆడలేడు. ఇలాంటి పరిస్థితుల్లో తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ సారథ్యం వహించే అవకాశం ఉంది.

Exit mobile version