Site icon HashtagU Telugu

Rohit Sharma : అయ్యో జడ్డూ ఎంత పని చేశావ్… క్యాప్ విసిరికొట్టిన రోహిత్ శర్మ

Rohit Sharma Throws India Cap In Anger After Sarfaraz Khan Run Out In Rajkot

Rohit Sharma Throws India Cap In Anger After Sarfaraz Khan Run Out In Rajkot

Rohit Sharma జాతీయ జట్టులో అరంగేట్రం చేసిన యువ ఆటగాడు సర్ఫ్ రాజ్ ఖాన్ ఆరంభ మ్యాచ లోనే దుమ్మురేపాడు. బాజ్ బాల్ కాన్సెప్ట్ తోనే ఇంగ్లాండ్ పై రెచ్చిపోయాడు. టీ ట్వంటీ తరహా బ్యాటింగ్ తో అదరగొట్టేశాడు. 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. జడేజాతో కలిసి నమోదు చేసిన పార్టనర్ షిప్ లో సర్ఫ్ రాజ్ వే ఎక్కువ పరుగులు ఉన్నాయి. అతని ఊపు చూస్తే సెంచరీ కూడా కొట్టేస్తాడనుకున్నారు. అయితే దురదృష్టవశాత్తూ జడేజా చేసిన తప్పిదానికి బలయ్యాడు. జడేజా 99 పరుగులు దగ్గర ఉన్నప్పుడు సింగిల్ కోసం పిలిచి వద్దని వెనక్కి వెళ్లిపోవడంతో సర్ఫ్ రాజ్ రనౌట్ అయ్యాడు.

దీంతో 62 పరుగుల దగ్గర సర్ఫ్ రాజ్ ఇన్నింగ్స్ కు తెరపడింది. సర్ఫ్ రాజ్ రనౌట్ అయినప్పుడు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లోనే కాదు స్టేడియం మొత్తం తీవ్ర నిరాశకు గురైంది. రోహిత్ శర్మ అయితే క్యాప్ ను విసిరికొట్టాడు. అదే సమయంలో జడ్డూ ఎంతపని చేశావు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఈ రనౌట్ ఎఫెక్ట్ కారణంగానే జడేజా తన సెంచరీ సెలబ్రేషన్స్ ను ఆనందంగా జరుపుకోలేకపోయాడు. మొత్తం మీద వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్న సర్ఫ్ రాజ్ ఖాన్ తనదైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు..