Rohit Sharma: టెస్ట్ కెప్టెన్సీ నుంచి రోహిత్ ఔట్ ?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఓటమితో ఐసీసీ టైటిల్ గెలిచే అవకాశాన్ని టీమిండియా చేజార్చుకుంది. ఐపీఎల్ నుంచి వచ్చి సరైన ప్రాక్టీస్ లేకుండా ఆడేయడంతోనే ఇలా జరిగిందన్న విమర్శలు వచ్చాయి.

Rohit Sharma: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఓటమితో ఐసీసీ టైటిల్ గెలిచే అవకాశాన్ని టీమిండియా చేజార్చుకుంది. ఐపీఎల్ నుంచి వచ్చి సరైన ప్రాక్టీస్ లేకుండా ఆడేయడంతోనే ఇలా జరిగిందన్న విమర్శలు వచ్చాయి. దీనితో పాటు జట్టు కూర్పుపైనా, రోహిత్ కెప్టెన్సీపైనా విమర్శలు వెల్లువెత్తాయి. టెస్టుల్లో హిట్‌మ్యాన్ కెప్టెన్సీ స్థాయికి తగినట్టు లేదన్నది చాలా మంది విశ్లేషిస్తున్నారు. తాజా ఓటమితో రోహిత్‌ను టెస్ట్ ఫార్మాట్ సారథిగా తొలగించాలన్న వాదనా మొదలైంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌ టూర్ తర్వాత రోహిత్ టెస్ట్ కెప్టెన్సీ భవితవ్యంపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. రోహిత్‌ను టెస్ట్ జట్టు కెప్టెన్‌గా తొలగిస్తారని గత వారం రోజులుగా వార్తలు వస్తున్నప్పటకీ.. విండీస్‌ టూర్‌లో అతనే సారథ్యం వహిస్తాడని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ఆ సమయంలోనే రోహిత్ భవిష్యత్తుపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విండీస్ టూర్‌లోనూ రోహిత్ విఫలమైతే మాత్రం ఖచ్చితంగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి మాత్రం రోహిత్‌నే కొనసాగిస్తారన్నారు. అయితే వన్డే ప్రపంచకప్‌కు ముందు రోహిత్ విషయంలో బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనేది కూడా ఖచ్చితంగా చెప్పలేమన్నారు. వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ షెడ్యూల్ కూడా విడుదలవగా.. అది ముగిసేసరికి రోహిత్ వయసు 38కి చేరుతుందని, అప్పటి వరకూ కొనసాగుతాడా లేదా అనేది తెలియాల్సి ఉందన్నారు.

ప్రస్తుతానికి ఈ రెండు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత అతని బ్యాటింగ్ ఫామ్ చూసి సెలక్షన్ కమిటీ అతనిపై తుది నిర్ణయానికి రావచ్చని భావిస్తున్నారు.జులైలో వెస్టిండీస్ తో సిరీస్ తర్వాత డిసెంబర్ లో సౌతాఫ్రికాతో సిరీస్ వరకూ మధ్యలో టీమిండియా టెస్టులు ఆడటం లేదు. దీంతో రోహిత్ పై నిర్ణయం తీసుకోవడానికి సెలక్టర్లకు తగినంత సమయం దొరుకుతుంది. మొత్తం మీద విండీస్ తో రెండు టెస్టుల సిరీస్ లో కెప్టెన్ గానే కాదు బ్యాట్ తోనూ రోహిత్ రాణించాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఓటమితో ఐసీసీ టైటిల్ గెలిచే అవకాశాన్ని టీమిండియా చేజార్చుకుంది. ఐపీఎల్ నుంచి వచ్చి సరైన ప్రాక్టీస్ లేకుండా ఆడేయడంతోనే ఇలా జరిగిందన్న విమర్శలు వచ్చాయి. దీనితో పాటు జట్టు కూర్పుపైనా, రోహిత్ కెప్టెన్సీపైనా విమర్శలు వెల్లువెత్తాయి. టెస్టుల్లో హిట్‌మ్యాన్ కెప్టెన్సీ స్థాయికి తగినట్టు లేదన్నది చాలా మంది విశ్లేషిస్తున్నారు. తాజా ఓటమితో రోహిత్‌ను టెస్ట్ ఫార్మాట్ సారథిగా తొలగించాలన్న వాదనా మొదలైంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌ టూర్ తర్వాత రోహిత్ టెస్ట్ కెప్టెన్సీ భవితవ్యంపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. రోహిత్‌ను టెస్ట్ జట్టు కెప్టెన్‌గా తొలగిస్తారని గత వారం రోజులుగా వార్తలు వస్తున్నప్పటకీ.. విండీస్‌ టూర్‌లో అతనే సారథ్యం వహిస్తాడని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ఆ సమయంలోనే రోహిత్ భవిష్యత్తుపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

విండీస్ టూర్‌లోనూ రోహిత్ విఫలమైతే మాత్రం ఖచ్చితంగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి మాత్రం రోహిత్‌నే కొనసాగిస్తారన్నారు. అయితే వన్డే ప్రపంచకప్‌కు ముందు రోహిత్ విషయంలో బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనేది కూడా ఖచ్చితంగా చెప్పలేమన్నారు. వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ షెడ్యూల్ కూడా విడుదలవగా.. అది ముగిసేసరికి రోహిత్ వయసు 38కి చేరుతుందని, అప్పటి వరకూ కొనసాగుతాడా లేదా అనేది తెలియాల్సి ఉందన్నారు.

ప్రస్తుతానికి ఈ రెండు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత అతని బ్యాటింగ్ ఫామ్ చూసి సెలక్షన్ కమిటీ అతనిపై తుది నిర్ణయానికి రావచ్చని భావిస్తున్నారు.జులైలో వెస్టిండీస్ తో సిరీస్ తర్వాత డిసెంబర్ లో సౌతాఫ్రికాతో సిరీస్ వరకూ మధ్యలో టీమిండియా టెస్టులు ఆడటం లేదు. దీంతో రోహిత్ పై నిర్ణయం తీసుకోవడానికి సెలక్టర్లకు తగినంత సమయం దొరుకుతుంది. మొత్తం మీద విండీస్ తో రెండు టెస్టుల సిరీస్ లో కెప్టెన్ గానే కాదు బ్యాట్ తోనూ రోహిత్ రాణించాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు.

Read More: Sanju Samson: విండీస్ టూర్ లో సంజూ శాంసన్ కు ఛాన్స్