Rohit Retirement: వన్డే, టెస్టు ఫార్మేట్ల రిటైర్మెంట్ పై రోహిత్ స్పందన

రోహిత్ కి 37 ఏళ్ళు. రోహిత్ ఇంకెన్నాళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడతాడన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వచ్చే ప్రపంచ కప్ నాటికీ రోహిత్ ఉండాలని కొందరు భావిస్తున్నారు. అయితే యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలి అంటే సీనియర్లను పక్కన పెట్టాల్సిందేనని మరికొందరు చెప్తున్నారు.

Rohit Retirement: 17 ఏళ్ళ నిరీక్షణ తర్వాత భారత్ టి20 ప్రపంచకప్ గెలిచింది. 2007లో ధోనీ సారధ్యంలో భారత్ తొలి టి20 ప్రపంచకప్ గెలవగా చాన్నాళ్ల తర్వాత రోహిత్ కెప్టెన్సీలో ఆ కల నిరవేరింది. కప్ గెలిచిన ఆనందంలో క్రికెట్ ఫ్యాన్స్ దేశవ్యాప్తంగా సంబురాల్లో మునిగిపోగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మేట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇది సగటు క్రికెట్ అభిమానిని తీవ్ర బాధకు గురి చేసింది. దీంతర్వాత తన అంతర్జాతీయ క్రికెట్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.

రోహిత్ కి 37 ఏళ్ళు. రోహిత్ ఇంకెన్నాళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడతాడన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వచ్చే ప్రపంచ కప్ నాటికీ రోహిత్ ఉండాలని కొందరు భావిస్తున్నారు. అయితే యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలి అంటే సీనియర్లను పక్కన పెట్టాల్సిందేనని మరికొందరు చెప్తున్నారు. ఈ కన్ఫ్యూషన్ మధ్య రోహిత్ శర్మ స్పందించాడు. టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న రోహిత్.. వన్డేలు, టెస్టుల నుంచి ఇప్పుడప్పుడే రిటైర్మెంట్ తీసుకోబోనని స్పష్టం చేశాడు. దీంతో సగటు క్రికెట్ అభిమాని ఊపిరి పీల్చుకున్నాడు.అయితే టీ20 ప్రపంచకప్ ఫైనల్ ముగిసిన వెంటనే విరాట్ కోహ్లీ, రోహిత్, రవీంద్ర జడేజాలు టీ20 ఇంటర్నేషనల్స్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అయినప్పటికీ ఇతర ఫార్మాట్లలో ఆడతామని ప్రకటించారు. రోహిత్ 159 టి20 ఇంటర్నేషనల్స్‌లో ఐదు సెంచరీలు మరియు 32 అర్ధ సెంచరీలతో సహా 4,231 పరుగులతో ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తన పదవీకాలాన్ని ముగించాడు.

ఆదివారం అమెరికాలో జరిగిన ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో రోహిత్ తన రిటైర్మెంట్ వార్తలపై పెదవి విప్పాడు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. నేను కొంతకాలం అంతర్జాతీయ క్రికెట్ ఆడటం మీరు చూస్తారని క్లారిటీ ఇచ్చాడు. ఈ నెల ప్రారంభంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా సెక్రటరీ జయ్ షా రోహిత్ కెప్టెన్సీలో భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మరియు 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ ఆడుతుందని ధృవీకరించారు.

Also Read: Krishna Chaitanya Power Peta : పవర్ పేట హీరో మారిపోయాడా..?

Follow us