IPL 2025: ముంబైకి బిగ్ షాక్.. ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్స్ గుడ్ బై

ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్ కు షాక్ తగలబోతోంది. ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ముంబైని వీడనున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది రోహిత్ ను తప్పించి సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్సీ ఇవ్వడం పెద్ద దుమారమే రేపింది.

IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ భారత క్రికెట్ కు కీలకం కానుంది. పలు కీలక మార్పులు అభిమానులు చూడబోతున్నారు. ఎందుకంటే ఈ సీజన్ కు ముందు ఆటగాళ్ళ మెగా వేలం జరగనుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా జట్ల రూపురేఖలు మారిపోనున్నాయి. పలు ఫ్రాంచైజీలు తమ జట్ల కూర్పుపై ఆలోచిస్తుంటే… మరోవైపు ఆటగాళ్ళు కూడా తమ ఫ్రాంచైజీలకు షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్ కు షాక్ తగలబోతోంది. ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ముంబైని వీడనున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది రోహిత్ ను తప్పించి సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్సీ ఇవ్వడం పెద్ద దుమారమే రేపింది. రోహిత్ ఫ్యాన్స్ ఈ మార్పులు అస్సలు అంగీకరించలేదు. గ్రౌండ్ లో పాండ్యాను తీవ్రంగా ట్రోల్ చేశారు. దీనికి తగ్గట్టే సారథిగా పాండ్యా కూడా అట్టర్ ఫ్లాపయ్యాడు. ఈ సీజన్ లో ముంబై కేవలం నాలుగే విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.

ఇదిలా ఉంటే కెప్టెన్సీ మార్పుపై రోహిత్ పైకి మాట్లాడకున్నా అసంతృప్తితోనే ఉన్నాడని అర్థమైంది. ఐదు టైటిల్స్ గెలిపించిన రోహిత్ ను సరైన విధంగా ఫ్రాంచైజీ గౌరవించలేదనే అభిప్రాయం వినిపించింది. ఈ కామెంట్స్ ఎలా ఉన్నా హిట్ మ్యాన్ మాత్రం ముంబైని వీడేందుకే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మెగా వేలంలో పాల్గొనాలని రోహిత్ భావిస్తున్నాడు. దీంతో అతని కోసం పలు ఫ్రాంచైజీలు పోటీపడడం ఖాయమని చెప్పొచ్చు. ఇప్పటికే రోహిత్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ , గుజరాత్ టైటాన్స్ ప్రయత్నిస్తున్నాయి. ఒకవేళ రోహిత్ ఏ టీమ్ లోకి వెళ్ళినా ఖచ్చితంగా సారథ్య బాధ్యతలు అప్పగిస్తారు. తాజా పరిణిమాలతో 13 ఏళ్ళుగా ముంబైతో ఉన్న రోహిత్ బంధానికి ఎండ్ కార్డ్ పడబోతోంది. 2011 డెక్కన్ ఛార్జర్స్ నుంచి ముంబై జట్టులోకి వచ్చిన రోహిత్ రెండేళ్ళకే జట్టు పగ్గాలు అందుకున్నాడు. అదే ఏడాది ఛాంపియన్ గా నిలపడంతో పాటు తర్వాత 2015, 2017, 2019, 2020లోనూ రోహిత్ ముంబైకి టైటిల్స్ అందించాడు.

మరోవైపు సూర్యకుమార్ యాదవ్ కూడా రోహిత్ బాటలోనే నడిచే అవకాశముందని తెలుస్తోంది. అతను కూడా వేలంలోకి వెళ్ళబోతున్నట్టు సమాచారం. ఇటీవలే భారత టీ ట్వంటీ సారథిగా ఎంపికైన సూర్యకుమార్ కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించడం ఖాయం. అలాగే ఆటగాడిగా ఒంటిచేత్తో మ్యాచ్ లను గెలిపించే సత్తా ఉన్న సూర్యకుమార్ యాదవ్ కు రికార్డ్ ధర పలకొచ్చు.

Also Read: 2027 ODI World: వారిద్దరికీ రిటైర్మెంట్ లేదు జడేజా కెరీర్ ముగియలేదన్న గంభీర్

Follow us