Site icon HashtagU Telugu

Rohit Sharma : రోహిత్ రికార్డుల మోత.. రాజ్ కోట్ లో కెప్టెన్ ఇన్నింగ్స్

Rohit Sharma To Open

Rohit Sharma To Open

Rohit Sharma ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. 3 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో ఉన్న దశలో హిట్ మ్యాన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చాలా రోజుల తర్వాత సెంచరీ సాధించాడు. ఈ దశలో రవీంద్ర జడేజాతో జతకట్టిన రోహిత్‌ శర్మ నాలుగో వికెట్‌కు 204 పరుగుల పార్టనర్ షిప్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 157 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసి రోహిత్‌ పలు రికార్డులు నమోదు చేశాడు.

హిట్‌మ్యాన్‌కు టెస్ట్‌ల్లో ఇది 11వ సెంచరీ కాగా.. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 47వది. కెప్టెన్‌గా అతనికి ఇది 10వ సెంచరీ కాగా.. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో రోహిత్‌ అ‍త్యధిక సెంచరీలు చేసిన జాబితాలో రోహిత్ మూడో ఆటగాడిగా ఉన్నాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో విరాట్‌ కొనసాగుతున్నాడు.

ఈ సెంచరీతో భారత్‌ తరఫున సెంచరీ చేసిన అత్యంత పెద్ద వయస్కుడైన సారథిగా నిలిచాడు. హిట్‌మ్యాన్‌ 36 ఏళ్ల 291 రోజుల వయసులో భారత కెప్టెన్‌గా సెంచరీ బాదాడు. ఇంత లేటు వయసులో ఏ భారత కెప్టెన్‌ సెంచరీ చేయలేదు.

ఈ మ్యాచ్‌లో రెండు సిక్సర్లు కొట్టిన రోహిత్‌.. ఇన్నింగ్స్‌ల పరంగా టెస్ట్‌ల్లో భారత్‌ తరఫున సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో రోహిత్‌.. ధోనిని అధిగమించాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్‌ టాప్‌లో ఉన్నాడు. సెహ్వాగ్ 178 ఇన్నింగ్స్ లలో 91 సిక్సర్లు కొడితే…రోహిత్ 97 ఇన్నింగ్స్ లలో 79 సిక్సర్లు బాదాడు.