Site icon HashtagU Telugu

Rohit Sharma: న్యూజిలాండ్‌తో మ్యాచ్‌.. రోహిత్ పేరిట చెత్త రికార్డు!

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ చివరి గ్రూప్ దశ భారత్-న్యూజిలాండ్ మధ్య దుబాయ్ క్రికెట్ స్టేడియంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరోసారి టాస్ ఓడిపోయాడు. టాస్ ఓడిపోయిన తర్వాత‌ రోహిత్ పేరు మీద ఇబ్బందికరమైన ప్రపంచ రికార్డు చేరింది. వరుసగా 13 వన్డేల్లో టాస్ ఓడిన జట్టుగా చరిత్రలో నిలిచిన జట్టుగా టీమిండియా నిలిచింది.

వన్డే మ్యాచ్‌ల్లో అత్యధిక టాస్‌లు కోల్పోయిన జట్లు

టోర్నీలో భారత్ అజేయంగా నిలిచింది

సెమీస్‌లో ఏ జట్లు తలపడతాయో ఈ మ్యాచ్ ఫలితం నిర్ణయిస్తుంది. న్యూజిలాండ్ తమ ప్రచారాన్ని ఆతిథ్య పాకిస్థాన్‌పై విజయంతో ప్రారంభించి, ఆపై బంగ్లాదేశ్‌ను ఓడించి సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించింది. మరోవైపు టైటిల్ కోసం బలమైన పోటీదారుగా పరిగణించబడుతున్న భారత్ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. అక్కడ వరుస మ్యాచ్‌లలో బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లను ఓడించింది.

Also Read: India vs New Zealand: న్యూజిలాండ్‌పై 25 ఏళ్ల పగ తీర్చుకోవాలని చూస్తోన్న టీమ్ ఇండియా!

భారత జట్టులో ఒక్క మార్పు

న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత జట్టులో మార్పు చోటు చేసుకుంది. ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా స్థానంలో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి జట్టు అవకాశం ఇచ్చింది. చక్రవర్తి ఈ టోర్నీలో తొలిసారి ఆడబోతున్నాడు.

భారత ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

న్యూజిలాండ్ ప్లేయింగ్ XI: విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (WK), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (c), మాట్ హెన్రీ, కైల్ జామీసన్, విలియం ఓ’రూర్క్.