IND vs WI T20 Series:విండీస్ చేరుకున్న రోహిత్, కుల్దీప్, దినేష్ కార్తీక్

కరేబియన్ టూర్ ను వన్డే సిరీస్ విజయంతో ఘనంగా ఆరంభించిన టీమిండియా ఇప్పుడు మూడో మ్యాచ్ కు రెడీ అవుతోంది.

  • Written By:
  • Publish Date - July 26, 2022 / 04:52 PM IST

కరేబియన్ టూర్ ను వన్డే సిరీస్ విజయంతో ఘనంగా ఆరంభించిన టీమిండియా ఇప్పుడు మూడో మ్యాచ్ కు రెడీ అవుతోంది. ఇదే సమయంలో టీ ట్వంటీ సీరీస్ కు ఎంపికయిన పలువురు ఆటగాళ్ళు విండీస్ గడ్డపై అడుగు పెట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్, రవి బిష్ణోయ్, కుల్డీప్ యాదవ్ జట్టుతో కలిశారు.
.ఇప్పటికే టీ20 సిరీస్ కోసం వీరంతా వెస్టిండీస్ చేరుకున్నారు. గాయం కారణంగా ఇంగ్లాండ్ టూర్‌లో చోటు దక్కించుకోలేకపోయిన కెఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్‌లకు కూడా విండీస్‌తో టీ20 సిరీస్‌లో అవకాశం దక్కింది. అయితే ఈ ఇద్దరూ ఫిట్‌నెస్ నిరూపించుకున్న తర్వాత ఆడనున్నారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, బీసీసీఐ నిర్వహించిన పరీక్షల్లో ఫిట్‌నెస్ నిరూపించుకుని వెస్టిండీస్‌ చేరుకున్నాడు.

అయితే కెఎల్ రాహుల్‌ గాయం నుంచి కోలుకున్నా, కరోనా పాజిటివ్‌గా తేలడంతో టీ20 సిరీస్‌కి అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. జర్మనీలో శస్త్ర చికిత్స చేయించుకున్న కెఎల్ రాహుల్, బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ కూడా చేశాడు. అయితే ఇక్కడే కెఎల్ రాహుల్ కరోనా పాజిటివ్‌గా తేలడంతో ప్రస్తుతం అతను ఐసోలేషన్‌లో ఉన్నాడు.టీ ట్వంటీ సిరీస్ సమయానికి కెఎల్ రాహుల్ కరోనా నుంచి కోలుకున్నా.. కనీసం రెండు మ్యాచ్ లకు అందుబాటులో ఉందే అవకాశం కనిపించడం లేదు. కాగా ఇంగ్లాండ్ టూర్ లో ఉన్న
పేసర్లు అర్షదీప్ సింగ్, హర్షల్ పటేల్‌, ఆవేశ్ ఖాన్‌లను బీసీసీఐ సెలెక్టర్లు కొనసాగించారు. భువనేశ్వర్ కుమార్ పేస్ విభాగాన్ని నడిపించనున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ చోటు దక్కించుకున్నారు. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్‌లు అవకాశం దక్కింది. ఇటీవలి కాలంలో ఫినిషర్ రోల్ పోషిస్తున్న దినేశ్ కార్తీక్ కూడా జట్టులో ఉన్నాడు.