Site icon HashtagU Telugu

Rohit Sharma: ఐసీసీ ర్యాంకింగ్స్ లో కోహ్లీని వెనక్కి నెట్టిన రోహిత్

Rohit Sharma (1)

Rohit Sharma (1)

Rohit Sharma: ప్రపంచ కప్ లో ఇప్పటివరకు 15 మ్యాచ్ లు పూర్తయ్యాయి. అందులో టీమిండియా ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయకేతనం ఎగురవేసింది. తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన టీమిండియా తదుపరి పాకిస్తాన్, ఆఫ్ఘానిస్తాన్ టీమ్స్ పై భారీ విజయాన్ని అందుకుంది. ఈ ప్రపంచ కప్ లో టీమిండియా మంచి ఫామ్ లో ఉంది. విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్ లో ఉన్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఒక సెంచరీ, పాక్ పై మెరుపు ఇన్నింగ్స్ ద్వారా రోహిత్ తన మునుపటి ఫామ్ ను చూపించారు.

కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టాప్ 10 లో చోటు దక్కించుకున్నాడు. గత రెండు తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బకు ఏకంగా 5 స్థానాలు ఎగబాగి టాప్ 6లోకి చేరుకున్నాడు. దీంతో టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీని దాటేశాడు. 2018లో రోహిత్ కెరీర్ బెస్ట్ వన్డే ర్యాంకు సాధించాడు. ఆ ఏడాది రోహిత్ ఐసీసీ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో నిలిచాడు. ఇదివరకు 700 పాయింట్లతో 11వ ర్యాంకులో ఉన్న రోహిత్ ఇప్పుడు 719 పాయింట్లతో 6వ స్థానంలో నిలిచాడు. బాబర్ ఆజమ్ 836 పాయింట్లతో టాప్‌‌లో కొనసాగుతున్నాడు. శుభ్‌మన్ గిల్ 818 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 711 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతున్నాడు.ఈ ప్రపంచ కప్ లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీతో చెలరేగిన సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ మూడు స్థానాలు ఎగబాకి 3వ ర్యాంక్ లో నిలిచాడు.

Also Read: Vijay Devarakonda : విజయ్ దేవరకొండ VD13 టైటిల్ అనౌన్స్.. ‘ఫ్యామిలీ స్టార్’ వచ్చేస్తున్నాడు..

Exit mobile version