Rohit Sharma Century: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో మ్యాచ్ కటక్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో (Rohit Sharma Century) అదరగొట్టాడు. రోహిత్ శర్మ చాలా కాలంగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడ్డాడు. ఈ సెంచరీతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చి విమర్శకుల నోరు మూయించాడు.
76 బంతుల్లో సెంచరీ సాధించాడు
ఇంగ్లండ్‌తో జరిగే రెండో వన్డేలో కేవలం 76 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ సిక్సర్ బాది తన వన్డే కెరీర్‌లో 32వ సెంచరీని పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 12 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. ఈ వన్డేలో అతని స్ట్రైక్ రేట్ 134.21. రోహిత్ శర్మ వన్డే కెరీర్‌లో ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ.
Also Read: YouTuber Vs SEBI: రూ.104 కోట్లు సంపాదించిన యూట్యూబర్.. ‘సెబీ’ బ్యాన్
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కటక్‌లోని బారాబతి స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 305 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య చేధనలో భారత్ తరపున రోహిత్ 76 బంతుల్లో సెంచరీ సాధించాడు. 7 సిక్సర్లు, 12 ఫోర్లు కొట్టాడు. 16 నెలల తర్వాత వన్డేల్లో రోహిత్ సెంచరీ సాధించాడు. అంతకుముందు 11 అక్టోబర్ 2023న ఆఫ్ఘనిస్తాన్‌పై సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన వన్డేలో రోహిత్ 131 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టుకు శుభారంభం లభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించారు. భారత్ స్కోరు 6.1 ఓవర్లలో 48 పరుగుల వద్ద ఉన్నప్పుడు వెలుతురు సరిగా లేకపోవడంతో ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. మళ్లీ ఆట మొదలైన తర్వాత కూడా రోహిత్ ఫోర్లు, సిక్సర్లు బాదుతూనే ఉన్నాడు. రోహిత్ కేవలం 30 బంతుల్లోనే తన యాభైని పూర్తి చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, సిక్సర్లు ఉన్నాయి. ఈ వార్త రాసే సమయానికి భారత్ 29 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ, అయ్యర్ ఉన్నారు.