Rohit Sharma: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కారుపై మూడు చలాన్లు జారీ అయ్యాయి. ఈ మూడు చలాన్లను ట్రాఫిక్ పోలీసులు జారీ చేశారు. నివేదికల ప్రకారం.. ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై రోహిత్ శర్మ తన కారును అత్యంత వేగంతో నడిపాడు. ఈ కారణంగా అతనిపై పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఈరోజు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. రోహిత్ శర్మ తన కారులో పూణె వెళ్తున్నాడు. ఈ సమయంలో హిట్ మ్యాన్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించాడు. దీనితో పోలీసులు మూడు చలాన్లు జారీ చేశారు.
ఐసిసి వన్డే ప్రపంచ కప్ 2023లో భారత క్రికెట్ జట్టు తన తదుపరి మ్యాచ్‌ను గురువారం బంగ్లాదేశ్‌తో (ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్) ఆడనుంది. పుణెలోని ఎంసీఏ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. రోహిత్ చేసిన ఈ తప్పిదంతో పూణె పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. స్పీడ్‌ని ఇష్టపడే రోహిత్‌కు ఓవర్‌స్పీడ్‌తో డ్రైవింగ్ చేయడం రోహిత్ కు ఇబ్బందిగా మారింది. ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేసిన భారత కెప్టెన్‌పై పూణె పోలీసులు చర్యలు తీసుకున్నారు.
Also Read: World Cup : న్యూజిలాండ్ జైత్రయాత్ర.. ఆప్ఘనిస్తాన్‌పై గెలుపుతో టాప్ ప్లేస్
పూణే మిర్రర్ నివేదిక ప్రకారం.. హిట్‌మ్యాన్ రోహిత్ ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై తన లంబోర్ఘిని కారులో వెళుతున్నాడు. ఈ సమయంలో అతని కారు వేగం గంటకు 215 కిలోమీటర్లుగా గుర్తించబడింది. దీంతో పోలీసులు రోహిత్ శర్మకి మూడు చలాన్లు జారీ చేశారు. ముంబై-పుణె హైవేపై వాహనాల గరిష్ట వేగం 100 కిలోమీటర్లు. కానీ రోహిత్ ఇంతకంటే ఎక్కువ వేగంతో కారు నడుపుతూ దొరికిపోయాడు. దీన్ని చాలా సీరియస్‌గా తీసుకున్న పూణే పోలీసులు అతని కారు నంబర్ ప్లేట్‌పై మూడు ఆన్‌లైన్ చలాన్‌లు జారీ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా తన తదుపరి వన్డే ప్రపంచకప్ 2023లో గురువారం బంగ్లాదేశ్‌తో ఆడనుంది. పూణెలోని ఎంసీఏ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ పూణెలో ఇప్పటివరకు 6 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఈ మైదానంలో హిట్ మ్యాన్ ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్‌ల్లో 147 పరుగులు మాత్రమే చేశాడు. ఈ మైదానంలో రోహిత్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 42 పరుగులు. ఎంసీఏ మైదానంలో రోహిత్ సగటు 24.50 మాత్రమే. స్ట్రైక్ రేట్ గురించి చెప్పాలంటే.. రోహిత్ 82 స్ట్రైక్ రేట్ వద్ద పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత కెప్టెన్ ఇప్పుడు తన రికార్డును మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాడు.