Site icon HashtagU Telugu

MI vs GT: సూర్యకుమార్ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్

Surya Kumar Yadav Mi

Surya Kumar Yadav Mi

MI vs GT: ఐపీఎల్ 2023లో 57వ మ్యాచ్ వాంఖడే వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై 27 పరుగుల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ వేగంగా బ్యాటింగ్ చేస్తూ ఐపీఎల్‌లో తొలి సెంచరీ సాధించాడు. సూర్య 47 బంతుల్లో 103 పరుగులతో అజేయంగా ఆడాడు. సూర్యకు అద్భుతమైన ఆత్మవిశ్వాసం ఉందని మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.

మ్యాచ్ గెలిచిన అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడారు.హీరో ఆఫ్ ది డే సూర్య కుమార్ యాదవ్ పై ప్రశంసలు కురిపించాడు. గుజరాత్ పై మేము గెలవడం చాలా గొప్ప అనుభూతినిచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. సూర్య కుమార్ యాదవ్ అద్భుతంగ ఆడాడని, అతనిలో గొప్ప కాన్ఫిడెన్స్ ఉందంటూ ప్రశంసించారు. నిజానికి మ్యాచ్ కి ముందు నేను సూర్య కుమార్ బ్యాటింగ్ ఆర్డర్ పై డిస్కస్ చేసుకున్నామని అన్నారు. బ్యాటింగ్ అర్దర్లో కుడి, ఎడమ చేతి కలయికతో వెళ్లాలా వద్దా అని చర్చించుకున్నాము. అయితే దానికి సూర్య నో చెప్పాడని రోహిత్ అన్నారు. సూర్య కుమార్ అద్భుతంగ రాణించడమే కాకుండా అతని ఆట ఇతరులపై ప్రభావం చూపుతుందని సూర్యపై ప్రశంసలు కురిపించాడు. సూర్య ప్రతి మ్యాచ్ ని కొత్తగా మొదలుపెట్టాలి అనుకుంటాడు. గత మ్యాచ్ లను పట్టించుకోకుండా ముందుకెళతాడని రోహిత్ అభిప్రాయపడ్డాడు.

శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గుజరాత్ పై ఎటాక్ చేసింది. 208 పరుగులతో గుజరాత్ బౌలర్లను చిత్తు చేసింది. 27 పరుగుల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. సూర్యకుమార్ అజేయ సెంచరీతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. గుజరాత్ తరుపున రషీద్ ఖాన్ అజేయంగా 79 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు.

Read More: MI vs GT: సూర్యా భాయ్ వన్ మ్యాన్ షో… గుజరాత్ ను చిత్తు చేసిన ముంబై

Exit mobile version