కోహ్లీకి అండగా నిలిచిన హిట్ మ్యాన్

వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్‌ కోహ్లి మొత్తంగా 26 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. విషయం తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
Kohli Rohit Sharma

Kohli Rohit Sharma

వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్‌ కోహ్లి మొత్తంగా 26 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. విషయం తెలిసిందే. అంతకుముందు దక్షిణాఫ్రికా టూర్ లో మూడు వన్డేల్లో కలిపి 116 పరుగులతో రాణించిన కోహ్లి… సొంతగడ్డపై మాత్రం దారుణంగా తేలిపోయాడు.దీంతో కోహ్లీ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో విండీస్ తో తొలి టీ 20 మ్యాచ్ ముంగిట మీడియాతో మాట్లాడిన రోహిత్‌ శర్మ విరాట్ కోహ్లిపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కోహ్లీ ఈ సిరీస్ లో సెంచరీ చేయకపోవచ్చనీ, . సౌతాఫ్రికా సిరీస్‌లో రెండు ఆఫ్ సెంచరీలు చేశాడని గుర్తు చేశాడు.. అంతా బాగానే ఉందన్న రోహిత్ అతని టాలెంట్ పై మాకు అపార నమ్మకముందన్నాడు. సుదీర్ఘ కాలంగా కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్నాడనీ, అలాంటి గొప్ప ఆటగాడికి కఠిన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలుసున్నాడు. వాస్తవానికి మీడియా వల్లే ఇలాంటి రూమర్లు వస్తున్నాయనీ రోహిత్ వ్యాఖ్యానించాడు . ఇకనైనా మీరు ఇలాంటి వాటికీ దూరంగా ఉంటే మంచిది అని రోహిత్ శర్మ అని మీడియా తీరుపై మండిపడ్డాడు.ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

  Last Updated: 15 Feb 2022, 07:33 PM IST