T20 World Cup 2024: కీపర్ విషయంలో రోహిత్ శర్మ సందిగ్ధత

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు వికెట్‌కీపర్‌ ఎంపిక రోహిత్‌ శర్మకు,మరియు టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. ఈ రేసులో రిషబ్ పంత్, సంజూ శాంసన్ ఇద్దరూ ఉన్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ టోర్నీలో రిషబ్ పంత్, సంజూ శాంసన్ అద్భుతంగ రాణించారు.

T20 World Cup 2024: రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా T20 ప్రపంచ కప్ కోసం అమెరికాలో అడుగుపెట్టింది. జూన్ 5న ఐర్లాండ్‌తో టీమ్ ఇండియా తన మొదటి మ్యాచ్ ఆడనుంది. న్యూయార్క్‌లో జరిగే ఈ టోర్నమెంట్ కోసం కెప్టెన్ రోహిత్ మరియు జట్టు సభ్యులు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టారు.

జూన్ 9న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. గ్రూప్‌-ఎలో భారత్‌తో పాటు ఐర్లాండ్‌, పాకిస్థాన్‌, అమెరికా, కెనడా ఉన్నాయి. కాగా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాకు వికెట్‌కీపర్‌ ఎంపిక రోహిత్‌ శర్మకు,మరియు టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. ఈ రేసులో రిషబ్ పంత్, సంజూ శాంసన్ ఇద్దరూ ఉన్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ టోర్నీలో రిషబ్ పంత్, సంజూ శాంసన్ అద్భుతంగ రాణించారు. ఇద్దరు ఆటగాళ్లు అటు కీపింగ్, ఇటు బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు.

చాలా కాలం తర్వాత ఐపీఎల్ ద్వారా పంత్ తిరిగి మైదానంలో అడుగు పెట్టాడు. ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌లు ఆడిన రిషబ్ పంత్ 40.55 సగటుతో 446 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయినప్పటికీ, అద్భుత ప్రదర్శనతో సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. ఫలితంగా రిషబ్ పంత్ టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యాడు. ఇక సంజు శాంసన్ ఈ సీజన్ ఐపీఎల్ లో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడాడు. 153.46 స్ట్రైక్ రేట్‌తో 531 పరుగులు చేశాడు. ఇందులో ఐదు అర్ధ సెంచరీలు నమోదయ్యాయి. కాగా ఈ ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో శాంసన్ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. అంతే కాకుండా కీపర్ గానూ అసాధారణ ప్రదర్శనతో మెప్పించాడు. ఈ పరిస్థితుల్లో ఎవర్ని తక్కువ అంచనా వేసేది లేదు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో ప్లేయింగ్ లెవెన్లో చోటు కోసం సంజూ శాంసన్, రిషబ్ పంత్ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తుంది. మరి ఇద్దరిలో ఒకరికే అవకాశం ఇవ్వాల్సి ఉండగా మరి రోహిత్ ఎవర్ని చూజ్ చేసుకుంటాడో చూడాలి. అయితే ఐపీఎల్‌ ఫామ్‌ను పరిశీలిస్తే రిషబ్‌ పంత్‌ కంటే సంజూ శాంసన్‌కు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మరి రిషబ్ ఆర్ సంజు ఎంపికలో మీ ఓట్ ఎవరికో కామెంట్ చేయండి.

Also Read: Delhi Water Crisis: ఢిల్లీలో తాగునీటి కొరత‌.. ఎంతలా అంటే ఈ వీడియో చూడండి..!