Rohit Sharma : 15 ఏళ్ళ కెరీర్.. రోహిత్ ఎమోషనల్ మెసేజ్

భారత కెప్టెన్ రోహిత్ శర్మకు జూన్ 23 చాలా స్పెషల్ డే.. సరిగ్గా ఇదే రోజున హిట్ మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

  • Written By:
  • Publish Date - June 23, 2022 / 03:38 PM IST

భారత కెప్టెన్ రోహిత్ శర్మకు జూన్ 23 చాలా స్పెషల్ డే.. సరిగ్గా ఇదే రోజున హిట్ మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 2007 జూన్ 23న బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా తరపున రోహిత్ తన మొట్టమొదటి మ్యాచ్ ఆడాడు. ఈ 15ఏళ్లలో రోహిత్ ఎన్నో మైలురాళ్లు, రికార్డులు అందుకున్నాడు. నేటితో 15 ఏళ్ల క్రికెట్‌ కెరీర్‌ పూర్తి చేసుకున్న రోహిత్‌ ఈ విషయాన్ని ట్విటర్‌లో పంచుకుంటూ ఎమోషనల్‌ అయ్యాడు. ఈ రోజుతో 15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌ను పూర్తి చేసుకున్నాననీ, ఇన్నేళ్ల నా ప్రయాణంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో మధురానుభూతులు.. ఒడిదుడుకులు, చీకటి రోజులు ఉంటాయన్నాడు. వాటిన్నింటిని అదిగమిస్తూ ఈస్థాయికి చేరుకున్నానంటే దానికి అందరి సపోర్ట్‌ ఒక కారణమన్నాడు. తన ప్రయాణంలో మద్దుతగా నిలిచిన క్రికెట్‌ లవర్స్‌, అభిమానులు, విమర్శలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాంటూ ముగించాడు. కెరీర్‌ ఆరంభంలో ఎక్కువగా మిడిలార్డర్‌లో వచ్చిన రోహిత్‌ శర్మ నిలకడలేమితో సతమతమయ్యాడు. అయితే సెహ్వాగ్‌, సచిన్‌ల రిటైర్మెంట్‌ తర్వాత ఓపెనర్‌గా ప్రమోషన్‌ పొందిన రోహిత్‌ శర్మకు ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వన్డేల్లో భారీ ఇన్నింగ్స్‌లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. వన్డే క్రికెట్‌లో మూడు డబుల్‌ సెంచరీలు కొట్టిన ఏ‍కైక బ్యాటర్‌గా రోహిత్‌ శర్మ నిలిచాడు. అంతేకాదు వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కలిగిన రికార్డు కూడా రోహిత్‌ పేరిటే ఉంది. కెరీర్లో మొత్తం 230 వన్డేలు, 125 టీ20లు, 45టెస్టులు ఆడిన హిట్ మ్యాన్ అన్ని ఫార్మాట్‌లలో కలిపి 15,733పరుగులు చేశాడు. ఇక విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్‌గా వైదొలిగిన తర్వాత రోహిత్‌ పూర్తిస్థాయిలో భారత కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.