Site icon HashtagU Telugu

Rohit Sharma Overweight: రోహిత్ శర్మ వెయిట్ పై డారిల్ కల్లినన్ కామెంట్స్ వైరల్

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma Overweight: టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ కొంతకాలంగా బ్యాడ్ ఫామ్ తో సతమతమవుతున్నాడు. ఈ మధ్య జరిగిన ఏ ఒక్క సిరీస్ లోనూ తనస్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్‌ తో జరిగిన మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్‌లో భారత్ దారుణంగా విఫలమైంది. ఈ సిరీస్ లోనూ రోహిత్ రాణించలేకపోయాడు. తాజాగా ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టులోనూ నిరాశపరిచాడు. రోహిత్ వైఫల్యాలకి అతని ఫిట్నెస్ (Rohit Sharma Overweight) ఏ కారణమంటున్నారు కొందరు మాజీలు.

దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు డారిల్ కల్లెనిన్ రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు చేశాడు. రోహిత్ శర్మ ఫ్లాట్ పిచ్ లపై మాత్రమే ఆడగలడని కల్లెనిన్ అన్నాడు. అలాగే రోహిత్‌కు బౌన్స్ సమస్య ఉందన్నాడు. అంతేకాదు రోహిత్ బాడీపై కూడా కామెంట్స్ చేశాడు. రోహిత్ ఈ మధ్య బాగా బరువు పెరగడం ద్వారా అది అతని ఆటపై ప్రభావం చూపిస్తుందని చెప్పాడు. అంతేకాక రోహిత్ తన ఫిట్‌నెస్ పై శ్రద్ద చూపించడం లేదన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టుకు హాజరవ్వని హిట్ మ్యాన్ ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా నేరుగా అడిలైడ్ టెస్టులో పాల్గొన్నాడని, సెలక్షన్ కమిటీలో నేనుంటే రోహిత్ ను కచ్చితంగా జట్టులో స్థానం కల్పించే వాడిని కాదంటూ సంచలన కామెంట్స్ చేశాడు. టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడుతోంది. ఈ టెస్టు సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు జరగ్గా ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది.

Also Read: Akhuratha Sankashti Chaturthi: డిసెంబ‌ర్ 18న గ‌ణేశుని పూజిస్తే మంచిది.. ఆ రోజు ప్ర‌త్యేక‌త ఇదే!

బుమ్రా సారధ్యంలో తొలి మ్యాచ్ గెలవగా.. రోహిత్ సారధ్యంలో రెండో టెస్ట్ కోల్పోయింది. 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా మూడో టెస్టు ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్టుకు ముందు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కల్లినన్ రోహిత్‌ను టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు రోహిత్ ప్రస్తుత ఫామ్ భారత జట్టులో టెన్షన్‌ను పెంచింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవాలంటే ఆస్ట్రేలియాను మిగిలిన మూడు టెస్టుల్లో భారత్ ఓడించాలి.