Site icon HashtagU Telugu

Rohit Sharma: టీ ట్వంటీల్లో హిట్ మ్యాన్ మరో రికార్డ్

Rohit Sharma

Rohit sHarma

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయి అందుకున్నాడు. టీ ట్వంటీ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాటిగా నిలిచాడు.

పాకిస్థాన్ తో సూపర్ 4 మ్యాచ్ లో రోహిత్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ కు ముందు అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న రోహిత్ 12 రన్స్ చేసిన తర్వాత రికార్డ్ సృష్టించాడు. అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్ లో ఇప్పటి వరకూ రోహిత్ 3548 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్ ముందు వరకూ న్యూజిలాండ్ మహిళా క్రికెటర్ 3531 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. ఇప్పుడు హిట్ మ్యాన్ ఆమెను అధిగమించాడు. అలాగే కెప్టెన్‌గా ఆసియా కప్‌లో 17 సిక్సర్లు పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ, అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్‌గా నిలిచాడు. ఇంతకుముందు ధోనీ 16 సిక్సర్లు, షాహిదీ ఆఫ్రిదీ 12, సౌరవ్ గంగూలీ 11 సిక్సర్లు బాది రోహిత్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. కాగా ఈ మ్యాచ్ లో రోహిత్ ధాటిగా ఆడినప్పటకీ భారీస్కోర్ చేయలేకపోయాడు. దూకుడు మీద కనిపించిన హిట్ మ్యాన్ 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 రన్స్ చేసాడు. మరో ఓపెనర్ రాహుల్ తో కలిసి తొలి వికెట్ కు 54 పరుగులు చేసిన రోహిత్ హ్యారిస్ రవూఫ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఇదిలా ఉంటే టీ20ల్లో రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ మధ్య ఇది 14వ హాఫ్ సెంచరీ భాగస్వామ్యం. టీ20 ఫార్మాట్‌లో ఇదే అత్యధికం. కాగా ఓపెనర్లు, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో పాక్ పై భారత్ 181 పరుగులు చేసింది.

Exit mobile version