Site icon HashtagU Telugu

IND vs ENG: రాజ్ కోట్ టెస్ట్‌లో రో..హిట్

IND vs ENG

IND vs ENG

IND vs ENG: రాజ్ కోట్ టెస్ట్‌లో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కుర్రాళ్ళు విఫలమైన చోట తన పెద్దరికాన్ని చూపించాడు. రవీంద్ర జడేజాతో కలిసి హిట్ మ్యాన్ ఇంగ్లాండ్ బౌలింగ్ దళాన్ని ధాటిగా ఎదుర్కొన్నాడు. ఫలితంగా సెంచరీకి చేరువయ్యాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే భారీగా ఎదురు దెబ్బలు తగిలాయి. ఆరంభంలో తడబడుతున్న ఇన్నింగ్స్‌ను టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ హ్యాండిల్ చేశాడు.

రాజ్ కోట్ టెస్ట్‌లో కుర్రాళ్ళు పూర్తిగా తేలిపోయారు.రెండో టెస్టులో డ‌బుల్ సెంచ‌రీతో అద‌ర‌గొట్టిన య‌శ‌స్వి జైస్వాల్ మూడో టెస్టులో విఫలం చెందాడు. ఈ టెస్టులో జైస్వాల్ 10 ప‌రుగుల వద్ద ఔట్ కాగా.. గిల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ర‌జ‌త్ పాటిదార్ కూడా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ లో 5 పరుగులకే ఔట్ కావడంతో భారత్ మ‌రింత క‌ష్టాల్లో పడింది. ఇలా యువకులు హ్యాండివ్వడంతో రోహిత్ శ‌ర్మ సాధికార ఇన్నింగ్స్ ఆడి భారీ సెంచరీతో గ‌ట్టెక్కించాడు. ఈ సిరీస్‌లో రోహిత్ శ‌ర్మ‌కు ఇదే ఫ‌స్ట్ సెంచ‌రీ. హైద‌రాబాద్‌తో పాటు వైజాగ్ టెస్టులో విఫ‌ల‌మైన హిట్ మ్యాన్ రాజ్ కోట్‌లో ప‌ట్టుద‌ల‌తో క్రీజులో నిలిచాడు. త‌న దూకుడు శైలికి భిన్నంగా ఇంగ్లండ్ పేస‌ర్ల‌ను ఎదుర్కొంటూ ఆచితూచి ఆడాడు. వికెట్ల ప‌తనాన్ని అడ్డుకున్నాడు.

రోహిత్ 71 బంతుల్లో 8 ఫోర్ల‌తో అర్ద శ‌త‌కం సాధించి ఆ తర్వాత దూకుడుగా ఆడాడు. రోహిత్ కు రవీంద్ర జడేజా మంచి సహకారం అందించాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసి సెంచరీకి చేరువయ్యాడు. ప్ర‌స్తుతం రోహిత్ శ‌ర్మ‌, రవీంద్ర జ‌డేజా క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ రెండు వికెట్లు, టామ్ హార్ట్‌లే ఒక వికెట్ తీశారు. ముఖ్యంగా టీమిండియాను ఇంగ్లండ్ పేస‌ర్ మార్క్‌వుడ్ ఆరంభంలోనే దెబ్బ‌కొట్టాడు. షోయ‌బ్ బ‌షీర్ స్థానంలో జ‌ట్టులోకి వ‌చ్చిన మార్క‌వుడ్ సెకండ్ టెస్ట్ హీరో య‌శ‌స్వి జైస్వాల్‌లో ఔట్ చేసి ఇంగ్లండ్‌కు బ్రేకిచ్చాడు. ఇక ఈ టెస్ట్ ద్వారా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన కెరీర్‌లో 100వ టెస్టు మెయిలు రాయి అందుకున్నాడు. స్టోక్స్ 99 టెస్టుల్లో 6 వేలకు పైగా పరుగులు చేశాడు. దాదాపు 200 వికెట్లు పడగొట్టాడు.

Also Read: Sonia Gandhi: రాయ్‌బరేలీ నియోజకవర్గ ప్రజలకు సోనియా గాంధీ భావోద్వేగ లేఖ