Site icon HashtagU Telugu

Rohit Sharma: టీమిండియాతో కలిసి రోహిత్ శర్మ ఆస్ట్రేలియా వెళ్తాడా? బిగ్ అప్డేట్ ఇదే!

Rohit Fans Emotional

Rohit Fans Emotional

Rohit Sharma: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ (Rohit Sharma) తన విలేకరుల సమావేశంలో పెద్ద అప్‌డేట్ ఇచ్చాడు. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో తొలి మ్యాచ్‌కు తాను దూరమయ్యే అవకాశం ఉందని రోహిత్ సూచించాడు. నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం టీమ్ ఇండియా సిద్ధమైంది. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ భారత జట్టుతో కలిసి వెళ్తాడా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఈ విషయంపై పెద్ద అప్డేట్ బయటకు వచ్చింది.

రోహిత్ శర్మ గురించి బిగ్ అప్‌డేట్

టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ అందుబాటులో ఉండడు. అయితే అతను టీమ్ ఇండియాతో కలిసి వెళ్లనున్నాడు. రాబోయే సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని రోహిత్ కొన్ని రోజుల పాటు ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాడు. ఆ తర్వాత భారత్‌కు తిరిగి రానున్నారు. దీని తర్వాత రెండో మ్యాచ్ కోసం రోహిత్ మళ్లీ ఆస్ట్రేలియాకు వెళ్లనున్నాడని తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. భారత జట్టు 2 భాగాలుగా ఆస్ట్రేలియాకు బయలుదేరుతుంది. నవంబర్ 10, 11 తేదీల్లో భారత జట్టు టేకాఫ్‌కు సిద్ధమైంది.

Also Read: CM Revanth Reddy : మీది పాదయాత్ర కాదు, పాప పరిహారయాత్ర – హరీష్ రావు

3 స్టాండ్‌బై ప్లేయర్‌లు కూడా సిద్ధంగా ఉన్నారు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ముగ్గురు ఆటగాళ్లను స్టాండ్‌బైగా ఉంచింది. ఇందులో నవదీప్ సైనీ, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్ పేర్లు ఉన్నాయి. ఈ ఆటగాళ్లు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నారు. ఇండియా A, ఆస్ట్రేలియా A మధ్య జరుగుతున్న 3-మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పాల్గొంటున్నారు. సిరీస్‌లో తొలి మ్యాచ్ నవంబర్ 22న జరగనుంది. దీని తర్వాత ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ తో టీమ్ ఇండియా వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ గులాబీ బంతితో ఆడనుంది.

భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, విరాట్ కోహ్లీ, ప్రసిధ్ కృష్ణ, రిష‌బ్ పంత్‌, కేఎల్ రాహుల్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్.