Site icon HashtagU Telugu

WTC 2023 Final: ఇంగ్లిష్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా

WTC 2023 Final

New Web Story Copy 2023 05 30t195117.352

WTC 2023 Final: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC Final 2023)లో భాగంగా ఆఖరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడాల్సి ఉంది. జూన్ 7 నుంచి ఓవల్‌లో జరిగే టైటిల్ మ్యాచ్‌లో ఇరు జట్ల మధ్య పోరు ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2023 సీజన్ ఫీవర్ తరువాత ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ కోసం భారత ఆటగాళ్ళు ఇంగ్లాండ్ కు చేరుకుంటున్నారు. విరాట్ కోహ్లి, పుజారా సహా పలువురు కీలక ఆటగాళ్లు ఇప్పటికే ఇంగ్లిష్ గడ్డపై అడుగు పెట్టారు. అదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ రోజు ఇంగ్లాండ్ చేరుకున్నాడు.

ఐపీఎల్ 2023లో రెండో క్వాలిఫయర్‌లో ముంబై ఇండియన్స్ గుజరాత్ చేతిలో ఓడింది. దీంతో ముంబై జట్టు ఐపీఎల్ సీజన్ 16 ప్రయాణం ముగిసింది. ముంబైని ఆరోసారి ఛాంపియన్‌గా నిలబెట్టాలనే కలను రోహిత్ నెరవేర్చుకోలేకపోయాడు. కానీ టీమిండియాను ప్రపంచ ఛాంపియన్‌గా నిలపడానికి రోహిత్ ఏ ఒక్క మార్గాన్ని వదులుకోవాలనుకోవడం లేదు. అందులో భాగంగా WTC కోసం రోహిత్ (Rohit Sharma) ఇంగ్లాండ్ చేరుకున్నాడు. ఈ మేరకు బీసీసీఐ (BCCI) తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ట్వీట్ చేసింది.

బ్యాటింగ్‌తో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారా తదితర ఆటగాళ్లు ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకున్నారు. విరాట్ సిరాజ్ మరియు ఉమేష్ యాదవ్‌లతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న చిత్రాలను బీసీసీఐ షేర్ చేసింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌లో కోహ్లీపై భారీ అంచనాలున్నాయి. సంవత్సర కాలంగా కోహ్లీ ఫుల్ స్వింగ్ లో కనిపిస్తున్నాడు. ఐపిఎల్ 2023 కూడా విరాట్‌ పరుగుల వరద పారించాడు.

ప్రస్తుతం టీమిండియా అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది. కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టు ఇబ్బంది పడుతోంది. జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ ఇప్పటికే జట్టులో లేరు. అదే సమయంలో కేఎల్ రాహుల్ కూడా గాయం కారణంగా ఈ టైటిల్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా బాధ్యత సిరాజ్‌, మహ్మద్‌ షమీ వంటి ఫాస్ట్‌ బౌలర్ల భుజాలపైనే ఉంది.

Read More: Sanjay Dutt: జైలుకు వెళ్లే ముందు కమిట్మెంట్ పూర్తి చేసిన సంజూ