Site icon HashtagU Telugu

Rohit Fan: 11 ఏళ్ళ బాలుడి బౌలింగ్ లో రోహిత్ ప్రాక్టీస్

Kid Imresizer

Kid Imresizer

మీరు చదివింది కరెక్టే… జట్టులో సీనియర్ బౌలర్లు, రిజర్వ్ బౌలర్లు ఉండగా భారత కెప్టెన్ రోహిత్ శర్మ 11 ఏళ్ల బాలుడి బౌలింగ్ లో ప్రాక్టీస్ చేయడమేంటి అనుకుంటున్నారా..అయితే అసలు సంగతి తెలుసుకోవాల్సిందే. ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ కోసం బ్రిస్బేన్ చేరుకున్న టీమిండియా నెట్ ప్రాక్టీస్ లో బిజిబిజీగా ఉంది.

భారత్ జట్టు ప్రాక్టీస్ చేస్తున్న స్టేడియంలోనే చాలా మంది చిన్నారులు క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్నారు. దూరం నుంచి వారి కోచింగ్ సెషన్స్ గమనించిన రోహిత్ ను ఓ బాలుడు ఆకట్టుకున్నాడు. అతని బౌలింగ్ తో ఇంప్రెస్ అయిన హిట్ మ్యాన్ పిలిపించి మాడ్లాడడమే కాదు కొన్ని బాల్స్ వేయమని కోరాడు. అనంతరం ఆ బాలుడి బౌలింగ్ లోనే రోహిత్ కొన్ని షాట్లు ఆడాడు. ఆ బాలుడి పేరు డ్రసిల్ చాహౌన్… భారత్ కే చెందిన ఆ బాలుడి ఇన్ స్వింగర్, యార్కర్లతో ఆకట్టుకున్నాడు. ఈ వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకుంది.