Rohit Sharma: భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో నాలుగో టెస్టు డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రారంభం కానుంది. ఈ బాక్సింగ్ డే టెస్టుకు ముందు టీమ్ ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) గాయపడ్డాడు. టీమిండియా త్రోడౌన్ స్పెషలిస్ట్ దయాను ఎదుర్కొనే సమయంలో రోహిత్ గాయంతో బాధపడ్డాడు. ఆ తర్వాత అతను అసౌకర్యంగా కనిపించాడు. దీని తర్వాత కూడా కొంత సేపు బ్యాటింగ్ కొనసాగించినా.. చివరకు ప్రాక్టీస్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.
నివేదికల ప్రకారం.. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌కు ముందు మెల్‌బోర్న్‌లో భారతదేశం రెండవ నెట్ సెషన్‌లో రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నాడు. గాయం తర్వాత భారత జట్టు ఫిజియో గాయపడిన భాగానికి ఐస్ ప్యాక్ వేయగా, రోహిత్ నొప్పితో కనిపించాడు. ఈ సమయంలో సర్ఫరాజ్ ఖాన్, యశస్వి జైస్వాల్‌తో పాటు మరికొందరు సిబ్బంది కూడా అతనితో ఉన్నారు. ఈ గాయం నాల్గవ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ నుండి రోహిత్‌ను తొలగించేంత తీవ్రమైనది కానప్పటికీ.. ఇది ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయం.
Also Read: Sritej Health Condition: శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై భిన్నాభిప్రాయాలు.. కిమ్స్ అలా.. మంత్రి ఇలా!
రోహిత్ పరుగుల కోసం తహతహలాడుతున్నాడు
భారత కెప్టెన్ ఈ సంవత్సరం ఇప్పటివరకు 24 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 26.39 సగటుతో 607 పరుగులు చేశాడు. ఇది ఒక క్యాలెండర్ సంవత్సరంలో అతని అత్యల్ప స్కోరు. న్యూజిలాండ్‌పై ఘోరంగా పరాజయం పాలైన తర్వాత ఆస్ట్రేలియాపై హిట్‌మ్యాన్ పరుగులు సాధించడం కోసం ఇబ్బందిపడుతున్నారు. అయితే మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనున్న నాలుగో టెస్టు టీమిండియాకు ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. జస్ప్రీత్ బుమ్రా, ఆకాశ్‌దీప్ వంటి బౌలర్ల కంటే అతను సిరీస్‌లో తక్కువ పరుగులు చేసిన పరిస్థితి నెలకొంది.
ఇప్పటికే ఇరు జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌లు ముగిశాయి. తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. రెండో టెస్టులో ఆసీస్ గెలుపొందింది. మూడో టెస్టు వర్షం ఆటకు పదే పదే అడ్డు రావడంతో డ్రా గా ముగిసింది. ఇప్పుడు జరగబోయే మిగిలిన రెండు టెస్టుల్లో గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాలని ఇరు జట్లు తీవ్రంగా కష్టపడుతున్నాయి.