Site icon HashtagU Telugu

Rohit Sharma: ముంబైపై రోహిత్ హ్యాట్రిక్ వికెట్స్

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma: ఐపీఎల్ కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. టైటిలే లక్ష్యంగా ఆయా జట్ల కెప్టెన్లు తమ తమ వ్యూహాలతో బరిలోకి దిగనున్నారు. ఈ సారి ముంబై ఇండియన్స్ పాత్ర ఎలా ఉంటోండోనన్న ఆసక్తి రోజురోజుకు పెరుగుతుంది.

గుజరాత్ కెప్టెన్ హార్దిక్ ని ముంబై తమ జట్టుకు కెప్టెన్ ని చేయగా, రోహిత్ ని పక్కనపెట్టేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయమనే చెప్పాలి. ఎందుకంటే జట్టుకు రోహిత్ చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశాడు. ముంబైని ఐదు సార్లు ఛాంపియన్ గా నిలబెట్టిన రోహిత్ ని కెప్టెన్ నుంచి తప్పించడం సగటు క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోయాడు. ఏదేమైనప్పటికీ ఈ ఏడాది రోహిత్ కెప్టెన్ గా కాకుండా కేవలం ఆటగాడిగానే మైదానంలోకి దిగనున్నాడు. 2011లో ముంబై ఇండియన్స్ రోహిత్‌ని తమ జట్టులో చేర్చుకుంది. ఆ తర్వాత 2013లో జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే ఐపీఎల్ ప్రారంభమైన కొత్తలో రోహిత్ శర్మ ఇదే ముంబైపై తన పొటన్షియాలిటీ చూపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

నిజానికి రోహిత్ శర్మ భారీ సిక్సులు ఫోర్లు కొట్టగలడని అందరికి తెలుసు, బట్ బౌలింగ్ లోను రోహిత్ తన పొటన్షియాలిటీ చూపించాడు. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ మొత్తం 15 వికెట్లు తీశాడు. 2009లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడుతున్నప్పుడు రోహిత్ ముంబై ఇండియన్స్‌పై హ్యాట్రిక్ వికెట్లు తీసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాడు. 2009లో రోహిత్ శర్మ మొత్తం 11 వికెట్లు తీశాడు. అదే ఏడాది ముంబై ఇండియన్స్‌పై 6 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన ఘనత సాధించాడు.వరుసగా మూడు బంతుల్లో అభిషేక్ నాయర్, హర్భజన్ సింగ్, జేపీ డుమినిలను అవుట్ చేశాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.

Also Read: T20 World Cup 2024: ఐపీఎల్ లో గాయపడితే ప్రపంచకప్ కష్టమే