Site icon HashtagU Telugu

Rohit Sharma- Hardik Pandya: రోహిత్ శ‌ర్మ‌ను హాగ్ చేసుకున్న హార్దిక్ పాండ్యా.. సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్‌..!

Rohit Sharma- Hardik Pandya

Safeimagekit Resized Img 11zon

Rohit Sharma- Hardik Pandya: ఐపీఎల్ 2024కి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ గురించి మాత్రమే ప్రతిచోటా చర్చనీయాంశమైంది. సీజన్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు, ఫ్రాంచైజీ రోహిత్ శర్మ నుండి కెప్టెన్సీ నుంచి తొల‌గించి హార్దిక్ పాండ్యా (Rohit Sharma- Hardik Pandya)ను కెప్టెన్‌గా చేసింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య వివాదానికి సంబంధించి అనేక వార్తలు వచ్చాయి. ఐపీఎల్‌లో రోహిత్ ముంబై తరఫున ఆడడని కూడా వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఇప్పుడు వారిద్దరూ ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో కలుసుకున్నారు. ఫ్రాంచైజీ ఆ వీడియోను సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంది.

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా ముంబై ఇండియన్స్ కొనసాగుతుంది. అయితే.. రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా చేసినప్పటి నుండి ఇరువురి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఫ్యాన్స్ కూడా ఒకరినొకరు ట్రోల్ చేసుకున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఈ ఇద్దరు ఆటగాళ్ళు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియా వేదిక‌గా తెగ వైర‌ల్ అవుతోంది.

Also Read: Pawan Kalyan: పిఠాపురంలో పవన్ పోటీపై చంద్రబాబు టెన్షన్

హార్దిక్ 2015లో ముంబై తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. అతను IPL 2022కి ముందు గుజరాత్ టైటాన్స్ (MI)లో భాగమయ్యాడు. అతను GTలో రెండు సీజన్ల తర్వాత MIకి ఇంటికి తిరిగి వచ్చాడు. అతని కెప్టెన్సీలో GT ఒకసారి టైటిల్ గెలుచుకుంది. ఒకసారి రన్నరప్‌గా నిలిచింది.

ముంబై ఇండియన్స్ జట్టు తన ప్రచారాన్ని మార్చి 24న ప్రారంభించనుంది. హార్దిక్ పాండ్యా ఈ జట్టుకు ఆటగాడిగా కెరీర్ ప్రారంభించాడు. ఇప్పుడు కెప్టెన్‌గా వచ్చాడు. రోహిత్ శర్మ వారసత్వాన్ని హ్యాండిల్ చేయడం అతనికి అంత సులభం కాదు. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో ఆ జట్టు తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ కెప్టెన్సీకి పరీక్ష రానుంది. సూర్యకుమార్ యాదవ్ కూడా తొలి మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతని స్థానంలో ఎవరు వస్తారో చూడాలి.

We’re now on WhatsApp : Click to Join

ముంబై ఇండియన్స్ జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రోహిత్ శర్మ, డెవాల్డ్ బ్రీవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నెహాల్ వధేరా, రొమారియో షెపర్డ్, గెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, తుషార, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, మహమ్మద్ నబీ, శివాలిక్ శర్మ, ల్యూక్ వుడ్, క్వేనా మఫాకా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్.