Site icon HashtagU Telugu

Rohit Sharma: హిట్ మ్యాన్ కు ఏమైంది ?

Rohit Sharma To Open

Rohit Sharma To Open

ప్రస్తుతం టీమిండియాలో కోహ్లీ పేలవ ఫామ్ తర్వాత భారత్ కు ఆందోళన కలిగిస్తోంది కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్. హిట్ మ్యాన్ కూడా కొంత కాలంగా సరిగ్గా ఆడడం లేదు. ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన కనబరిచిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ లీసెస్టర్‌షైర్ కౌంటీ జట్టుతో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లోనూ నిరాశ పరిచాడు.

ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచే ఫాస్ట్‌ బౌలర్లను ఎదుర్కొవడానికి రోహిత్‌ చాలా ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా ప్రాక్టీస్ గేమ్‌లో లీస్టర్‌షైర్ తరపున ఆడుతున్న జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో రోహిత్‌ తడబడ్డాడు.ఈ మ్యాచ్‌లో సీమర్లు బ్యాక్ ఆఫ్ ది లెంగ్త్ బౌలింగ్‌తో రోహిత్‌ను ముప్పుతిప్పులు పెట్టారు. అఖరికి రోమన్‌ వాకర్‌ బౌలింగ్‌లో నిర్లక్షమైన షాట్‌ ఆడి తన వికెట్‌ను చేజార్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 47 బంతులు ఎదర్కున్న రోహిత్‌.. కేవలం 25 పరుగుల మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. లీస్టర్‌షైర్ బౌలింగ్ లోనే ఇలా ఇబ్బంది పడితే ఫామ్ లో ఉన్న ఇంగ్లాండ్ బౌలర్లను రోహిత్ ఎలా ఎదుర్కొంటాడని మాజీ ఆటగాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇంగ్లాండ్ గడ్డపై చారిత్రక సీరీస్ విజయం సాధించాలంటే రోహిత్ , కోహ్లీ ఫామ్ లోకి రావడం తప్పనిసరి. మరి రెండో ఇన్నింగ్స్ లోనైనా రోహిత్ ఫామ్ అందుకోవాలని ఫాన్స్ కోరుకుంటున్నారు.

Exit mobile version