శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 0-1తేడాతో వెనుకబడి ఉంది. బుధవారం కొలంబో వేదికగా జరగనున్న మూడో వన్డే మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని భారత జట్టు గట్టి పట్టుదలతో ఉంది. కాగా.. ఈ మూడో వన్డే మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. మూడో వన్డేలో గనుక హిట్‌మ్యాన్ రెండు సిక్సర్లు బాదితే.. వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా రికార్డులకు ఎక్కనున్నాడు.
ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్‌గేల్ రికార్డును బ్రేక్ చేయనున్నాడు. 294 ఇన్నింగ్స్‌ల్లో గేల్ 331 సిక్సర్లు కొట్టాడు. ప్రస్తుతం రోహిత్ 256 ఇన్నింగ్స్‌ల్లో 330 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఈ జాబితాలో పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు షాహిద్ అఫ్రిది అగ్రస్థానంలో ఉన్నాడు. 369 ఇన్నింగ్స్‌ల్లో అప్రిది 351 సిక్సర్లను బాదాడు.
వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే..
షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్) – 369 ఇన్నింగ్స్‌లో 351 సిక్సర్లు
క్రిస్‌గేల్ (వెస్టిండీస్) – 294 ఇన్నింగ్స్‌ల్లో 331 సిక్సర్లు
రోహిత్ శర్మ (భారత్) – 256 ఇన్నింగ్స్‌ల్లో 330 సిక్సర్లు
సనత్ జయసూర్య (శ్రీలంక) – 433 ఇన్నింగ్స్‌ల్లో 270 సిక్సర్లు
మహేంద్ర సింగ్ ధోని (భారత్) – 297 ఇన్నింగ్స్‌ల్లో 229 సిక్సర్లు
ఛేదనలో అత్యధిక సిక్సర్ల వీరుడిగా..
వన్డేల్లో లక్ష్య ఛేదనలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేల్లో అతడు ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో అతడు క్రిస్‌గేల్ రికార్డును బ్రేక్ చేశాడు. గేల్ 177 సిక్సర్లు బాదగా రోహిత్ శర్మ 179 సిక్సర్లు కొట్టాడు. ఆ తరువాతి స్థానాల్లో అఫ్రిది, జయసూర్య లు ఉన్నారు. ఇక రెండో వన్డేల్లో రోహిత్ 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 64 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ ధాటిగా ఆడినప్పటికి కూడా భారత్ ఓడిపోయింది.
లక్ష్య ఛేదనలో అత్యధిక సిక్సర్ల వీరులు..
రోహిత్ శర్మ (భారత్) – 179 సిక్సర్లు
క్రిస్‌గేల్ (వెస్టిండీస్) – 177 సిక్సర్లు
షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్) – 166 సిక్సర్లు
సనత్ జయసూర్య (శ్రీలంక) – 109 సిక్సర్లు
మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్) – 103 సిక్సర్లు
ALSO READ : Vinod Kambli : నడవలేని స్థితిలో సచిన్ స్నేహితుడు.. ఇతడు మాజీ భారత స్టార్ ఆటగాడు కూడా..