Site icon HashtagU Telugu

Rohit Sharma : నా రిటైర్మెంట్ అప్పుడే…రికార్డుల కోసం ఆడనన్న హిట్ మ్యాన్

Rohit Sharma

Rohit Sharma

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఏ రోజు అయితే తాను ఆడలేననే ఫీలింగ్ కలుగుతోందో ఆ క్షణమే రిటైర్మెంట్ ప్రకటిస్తానని స్పష్టం చేశాడు. అయితే గత మూడేళ్లుగా తాను మెరుగ్గా ఆడుతున్నానని, తన ఆట ఎంతో మెరుగైందని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌‌ విజయం తర్వాత రోహిత్ శర్మ పలు అంశాలపై మాట్లాడాడు.ఏ రోజు అయితే నిద్రలేచిన వెంటనే క్రికెట్ ఆడేందుకు అసౌకర్యంగా ఫీలవుతానో.. క్రీడలు ఆడటానికి సరిపోను అని భావిస్తానో.. ఆ క్షణమే రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటిస్తాననీ హిట్ మ్యాన్ తేల్చేశాడు.

We’re now on WhatsApp. Click to Join.

అయితే జట్టులో రికార్డుల కోసం కాకుండా స్వేచ్చగా ఆడే సంప్రదాయం తీసుకురావడంపై ఫోకస్ పెట్టినట్లు రోహిత్ చెప్పాడు. తాను గణంకాలను పట్టించుకునే వ్యక్తిని ఏ మాత్రం కాదన్నాడు. భారీ పరుగులు చేయడం ముఖ్యమేననీ, గణంకాలతో సంబంధం లేకుండా ఆడే సంప్రదాయాన్ని తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పాడు. ప్రతీ ఆటగాడు మైదానంలోకి వెళ్లి స్వేచ్చగా ఆడటమే తనకు కావాలన్నాడు. సమష్టి ప్రదర్శనతో ధర్మశాల టెస్ట్‌లో గెలిచామని, కుర్రాళ్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారని రోహిత్ ప్రశంసించాడు. టెస్టు సిరీస్ గెలవాలంటే అన్ని విభాగాల్లో సత్తాచాటాలన్నాడు. . జట్టులో ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లకు కాస్త అనుభవం తక్కువగా ఉన్నా ఒత్తిడిని జయిస్తూ రాణించారని కితాబిచ్చాడు.

Read Also : DK Shiva Kumar : మా ఇంట్లో కూడా నీళ్లు లేవు..!