Site icon HashtagU Telugu

WI vs IND 1st T20I: తొలి టీ ట్వంటీలో భారత్ ఘన విజయం

rohit sharma t20

rohit sharma t20

కరేబియన్ టూర్ లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వన్డే సిరీస్ ను స్వీప్ చేసిన భారత్ తాజాగా టీ ట్వంటీ సీరీస్ లోనూ శుభారంభం చేసింది. ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి టీ ట్వంటీ లో విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు 4.4 ఓవర్లలో 44 పరుగులు జోడించారు. సూర్య కుమార్ యాదవ్ 24 రన్స్ కు ఔటవగా పంత్ , శ్రేయాస్ అయ్యర్ నిరాశ పరిచారు. వికెట్లు పడుతున్నప్పటికీ రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ ఆకట్టుకున్నాడు. ఇదే క్రమంలో అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

ఇందులో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అర్ధ సెంచరీ పూర్తి చేసిన హిట్ మ్యాన్ దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఔటయ్యాడు. రోహిత్ ఔటైన తర్వాత చివర్లో దినేశ్ కార్తీక్ మెరుపులు మెరిపించాడు. రవిచంద్రన్ అశ్విన్ సాయంతో ధాటిగా ఆడి జట్టుకు మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 19 బంతుల్లో 41 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.