టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ ఎవరనేది బీసీసీఐ ఇంకా ప్రకటించ లేదు. వన్డే , టీ ట్వంటీ కెప్టెన్ గా ఉన్న రోహిత్ కే టెస్ట్ ఫార్మాట్ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. రోహిత్ కు టెస్ట్ కెప్టెన్సీ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సమర్ధిస్తే…మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా బీసీసీఐ మాజీ సెలక్టర్ సాబా కరీం రోహిత్ శర్మ కెప్టెన్సీ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫిట్ నెస్ సమస్యలు ఎక్కువగా ఉన్న వ్యక్తికి టెస్ట్ కెప్టెన్సీ అప్పగించడం అంత మంచిది కాదని వ్యాఖ్యానించాడు. కెప్టెన్సీ విషయంలో మాత్రం రోహిత్ శర్మ ముందు వయసు, ఫిట్‌నెస్ అనే అంశం నిత్యం తెరపైకి వస్తోందన్నాడు. సిరీస్‌కు ముందు ఒక ఆటగాడు గాయపడితే, అతన్ని ఎక్కువ కాలం కెప్టెన్‌గా చేయలేనని చెప్పాడు. రోహిత్‌కు ఫిట్‌గా ఉండటమే అతిపెద్ద సవాలు అన్నాడు. మూడు ఫార్మాట్లలో ఆడడం కూడా కష్టమైన పనిగా చెప్పిన సాబా కరీం అతను చాలాసార్లు గాయపడ్డాడనీ గుర్తు చేశాడు .
భారత జట్టు తన తదుపరి టెస్టు సిరీస్‌ని శ్రీలంకతో ఫిబ్రవరి-మార్చిలో స్వదేశంలో ఆడాల్సి ఉంది. ప్రస్తుతానికి రోహిత్ శర్మ కూడా టెస్ట్ కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సబా కరీం కూడా రోహిత్‌ని కొంతకాలం మాత్రమే కెప్టెన్‌గా చేయడం సరైందని అభిప్రాయపడ్డాడు.రోహిత్‌ను మూడు ఫార్మాట్‌లలో కెప్టెన్‌గా చేసినా, అది తక్కువ సమయం మాత్రమేనని వ్యాఖ్యానించాడు.. 2023 భారత క్రికెట్‌కు చాలా ముఖ్యమైన సంవత్సరమని, . ఈ సమయంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కూడా ముగుస్తుందని, అందుకే సెలక్టర్లు. ముందుగా ఈ దశ గురించి ఆలోచించాలని చెప్పాడు.