Rohit Sharma: భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సిడ్నీ టెస్ట్ ఆడకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత అతని సుదీర్ఘ ఫార్మాట్ కెరీర్ ముగిసినట్లు వార్తలు రావడం ప్రారంభించాయి. అయితే భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ గురించి మౌనం వీడాడు. ఇదే సమయంలో రాబోయే రోజుల్లో తన ప్లాన్ ఏమిటనే దానిపై కూడా క్లారిటీ ఇచ్చాడు. సిడ్నీలో బయట ఎందుకు కూర్చోవాలని నిర్ణయించుకున్నాడో కూడా రోహిత్ చెప్పాడు. ప్రస్తుతం క్రికెట్‌ని వదిలి ఎక్కడికీ వెళ్లడం లేదని రోహిత్ చెప్పాడు. తాను చాలా కష్టపడుతున్నానని, అయితే రాణించలేకపోతున్నానని, అందుకే సిడ్నీ టెస్టుకు దూరంగా ఉండాల్సి వచ్చిందని రోహిత్ చెప్పాడు.
ఈరోజు (జనవరి 4) స్టార్ స్పోర్ట్స్‌లో రోహిత్ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి క్రికెట్‌ని వదిలి ఎక్కడికీ వెళ్లడం లేదని రోహిత్ స్పష్టం చేశాడు. రోహిత్ మాట్లాడుతూ.. నేను త్వరలో రిటైర్మెంట్ తీసుకోను. పరుగులు రాకపోవడంతో ఈ మ్యాచ్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. నేను కష్టపడి తిరిగి వస్తాను. ప్రస్తుతం పరుగులు రావడం లేదు. కానీ 5 నెలల తర్వాత కూడా పరుగులు రాకుండా ఉంటాయన్న గ్యారెంటీ లేదని అన్నాడు.
Also Read: Jasprit Bumrah: బుమ్రా హెల్త్ అప్డేట్ ఇదే.. బ్యాటింగ్ ఓకే.. బౌలింగే డౌట్?
ఐదో టెస్టు నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాను అంతే.. కానీ నేను ఎక్కడికీ వెళ్ళడం లేదు. ఇది రిటైర్మెంట్ లేదా ఫార్మాట్ నుండి వైదొలగడం వంటి నిర్ణయం కాదు. మైక్, పెన్, ల్యాప్‌టాప్ ఉన్నవారు ఎవరు ఏమి వ్రాసినా, చెప్పినా పర్వాలేదు. వారు మన కోసం ఎటువంటి నిర్ణయం తీసుకోలేరు. నేను సిడ్నీకి వచ్చిన తర్వాత తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను ఏమి చేస్తున్నానో నాకు తెలుసు అనేంత పరిణతి సాధించాను అని రోహిత్ ఘాటుగానే స్పందించాడు.
ఈ సమయంలో సిడ్నీ టెస్ట్ నుండి వైదొలగడం తన నిర్ణయమని రోహిత్ స్పష్టం చేశాడు. అతను ఇక్కడ (సిడ్నీ) వచ్చి ఈ విషయాన్ని కోచ్ (గౌతమ్ గంభీర్), చీఫ్ సెలెక్టర్ (అజిత్ అగార్కర్)కి తెలియజేసాడని బీసీసీఐ వర్గాల సమాచారం. ఈ సంభాషణలో కూడా అతను క్రికెట్ కు గుడ్ బై చెప్పటంలేదని వారికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.