టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా
పేలవమైన ప్రదర్శనతో బీసీసీఐ యాక్షన్ మోడ్‌లోకి వచ్చింది. ఈనేపథ్యంలో నిన్న(ఆదివారం) బీసీసీఐ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, ఎన్‌సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ పాల్గొన్నారు. మీడియా కథనాల ప్రకారం..ఈ సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి నిర్దిష్ట చర్చ జరగలేదు.టీ20 ప్రపంచకప్ సెమీ-ఫైనల్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని ఇండియా టీమ్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఓటమి తర్వాత టీమిండియా సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శనతో పాటు రోహిత్ శర్మ కెప్టెన్సీ కూడా ప్రశ్నార్థకంగా మారింది. తాజా
సమావేశంలో టీమిండియా ఆటతీరు, రోడ్‌మ్యాప్ వంటి అంశాలు చర్చకు వచ్చాయని సమాచారం. అయితే కెప్టెన్‌గా రోహిత్ శర్మ భవిష్యత్తుపై మాత్రం చర్చ జరగలేదు.
చేతన్ శర్మ మరోసారి ఎన్నికవుతారా ?
చేతన్ శర్మ మరోసారి అధ్యక్ష పదవికి ఎన్నికవుతారా అని బీసీసీఐ వర్గాలను మీడియా ప్రశ్నించగా.. “మొదట, చేతన్‌కు చెప్పకపోతే, అతను మొదట దరఖాస్తు చేసుకోడు. ఇది స్వయంగా ఒక సంకేతం. భారత్ మరో 10 నెలల్లో ప్రపంచకప్ ఆడాల్సి ఉంది. చేతన్ మరియు హర్విందర్ ఉనికి ముగ్గురు కొత్త సభ్యులతో కొనసాగింపును జోడిస్తుంది” అని స్పష్టం చేశారు.
ఏయే మార్పులు జరగొచ్చు..
BCCI ఇంకా సెలక్షన్ ప్యానెల్‌ను ఏర్పాటు చేయలేదు. శ్రీలంక పరిమిత ఓవర్ల సిరీస్ కోసం.. గతంలో చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్ జట్టును ఎంపిక చేసింది. ఆ తర్వాత చేతన్ శర్మ సెలక్షన్ ప్యానెల్ రద్దు అయింది.
దాని స్థానంలో కొత్త సెలక్షన్ కమిటీ ఏర్పాటు కానుంది. అది జరిగిన తర్వాత స్ప్లిట్ కెప్టెన్సీ ,కోచింగ్ అంశాలపై BCCI ఫోకస్ చేయనుంది. అంటే రానున్న కాలంలో హార్దిక్ పాండ్యను టీ20కి కెప్టెన్‌గా నియమించవచ్చు. రోహిత్ ను వన్డేల కెప్టెన్సీని కొనసాగించే ఛాన్స్ ఉంది. ఇక రాహుల్ ద్రవిడ్ వన్డేలు, టెస్టు క్రికెట్‌లో మాత్రమే టీమ్ ఇండియా కోచ్‌గా ఉంటారు. T20 ఫార్మాట్ బాధ్యత నుంచి ఆయన్ను తప్పించే ఛాన్స్ ఉంది.
జనవరి 3 నుంచి భారత్-శ్రీలంక సిరీస్
భారత జట్టు జనవరి 3 నుంచి శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది, దీనికి హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రితురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శుభమాన్ గిల్ వంటి యువ ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లకు విశ్రాంతి ఇచ్చారు. జనవరి 3న ముంబైలో ఇరు దేశాల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. మరోవైపు జనవరి 5న పుణెలో రెండో టీ20, జనవరి 7న రాజ్‌కోట్‌లో మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత, రెండు జట్ల మధ్య మూడు వన్డేలు కూడా జరుగుతాయి, అందులో రోహిత్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.