Site icon HashtagU Telugu

Rohit Sharma Record: మోస్ట్ ప‌వ‌ర్‌ఫుల్ కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌.. ధోనీ రికార్డు కూడా బ‌ద్దలు, ఏ విష‌యంలో అంటే..?

Rohit Sharma Lamborghini

Rohit Sharma Lamborghini

Rohit Sharma Record: భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన కెరీర్‌లో రోజుకో కొత్త రికార్డులు (Rohit Sharma Record) సృష్టిస్తున్నాడు. బుధవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సారథ్యంలో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత టీమిండియా బౌలర్లు ఐర్లాండ్‌ను 96 పరుగులకే కట్టడి చేశారు. దీనిని ఛేదించేందుకు వచ్చిన రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఫిఫ్టీ బాదాడు. రోహిత్ శ‌ర్మ‌ రిటైర్డ్ హర్ట్ అయ్యాక పంత్‌ మ్యాచ్ ముగించాడు. పంత్ 26 బంతుల్లో అజేయంగా 36 పరుగులు చేసి టీమ్ ఇండియాను విజయతీరాలకు చేర్చాడు. ఈ శుభారంభంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన పేరిట ఓ పెద్ద రికార్డును నమోదు చేసుకున్నాడు.

ఎంఎస్ ధోని రికార్డు బద్దలైంది

టీ-20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ ఇప్పటివరకు 42 టీ-20 మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియాను విజయతీరాలకు చేర్చాడు. ఈ విషయంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును బద్దలు కొట్టాడు. ధోనీ సారథ్యంలో టీమిండియా 41 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ విషయంలో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు. విరాట్ సారథ్యంలోని భారత జట్టు 32 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

Also Read: Akira Nandan: పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీ?

భారత్‌కు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు

టీ-20 ఇంటర్నేషనల్‌లో భారత్‌కు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ ఇప్పటివరకు 55 మ్యాచ్‌లు ఆడగా 42 గెలిచాడు. కేవలం 12 టీ20 మ్యాచ్‌ల్లోనే ఓటమి చ‌విచూశాడు. కాగా ఒక మ్యాచ్ టై అయింది. రోహిత్ శర్మ గెలుపు శాతం 76.36గా ఉంది. ఎంఎస్ ధోని రికార్డు గురించి మాట్లాడుకుంటే.. అతను 72 మ్యాచ్‌లలో 41 గెలిచాడు. కాగా 28లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ధోనీ కెప్టెన్సీలో కూడా ఒక మ్యాచ్ టై అయింది. ధోనీ గెలుపు శాతం 56.94గా ఉంది. ఇప్పుడు ఈ విషయంలో రోహిత్ శ‌ర్మ‌.. ధోనీ కంటే ముందున్నాడు.

We’re now on WhatsApp : Click to Join

టాప్‌లో బాబర్ ఆజం

అంతర్జాతీయ T-20లో ప్రపంచంలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ పాకిస్థాన్‌కు చెందిన బాబర్ అజామ్. బాబర్ ఇప్పటివరకు 81 టీ-20 మ్యాచ్‌లు ఆడగా 46 గెలిచాడు. 28 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. బాబర్ అజామ్ కెప్టెన్‌గా ప్రపంచంలో అత్యధిక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పుడు భారత్-పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో బాబర్ ఆజం, రోహిత్ శర్మలు తలపడనున్నారు. ఈ మ్యాచ్‌లో ఏ కెప్టెన్‌ గెలుస్తాడనేది ఆసక్తికరంగా మారింది.