Site icon HashtagU Telugu

Rohit vs Virat: విరాట్ – రోహిత్ మధ్య తేడా

Rohit vs Virat

New Web Story Copy 2023 08 05t224903.506

Rohit vs Virat: టీమిండియా ఆటగాళ్లపై విమర్శలు చేయడం పాకిస్థాన్ మాజీలకు పరిపాటిగా మారింది. సొంతంగా యూట్యూబ్ ఛానెల్స్ పెట్టుకుని రోజుకొకర్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ రోహిత్ శర్మ ఆటతీరుపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్ ని కోహ్లీతో పోల్చుతూ వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ కోహ్లీ స్థాయికి ఎప్పటికీ చేరుకోలేడంటూ విమర్శించాడు.

రోహిత్ శర్మ ఆటతీరు బాగానే ఉన్నప్పటికీ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఒత్తిడిని తట్టుకోలేడు. ఒత్తిడిని అధిగమించి ఆడటం రోహిత్ శర్మ వల్ల కాదు. అందుకే నాకౌట్ మ్యాచుల్లో రోహిత్ శర్మ విఫలమవుతాడు. ఆడాల్సిన మ్యాచ్ లో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి జట్టున గెలిపించిన సందర్భాలు ఒక్కటి కూడా లేవు. టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు జట్టు బాధ్యతను భుజాన వేసుకుని ఒంటిచేత్తో గెలిపించడం రోహిత్ వల్ల కానేకాదు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ ఒక్కడే ఆడి ఎన్నో సందర్భాల్లో విజయం అందించాడు. విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకు ఉన్న తేడా ఇదే. సాధారణ మ్యాచుల్లో బాగా ఆడితే మంచి ప్లేయర్ అని మాత్రమే అంటారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాగా ఆడితేనే గొప్ప ప్లేయర్ అవుతారు. రిటైర్ అయ్యేలోపు రోహిత్ శర్మ అలాంటి ఓ గొప్ప ఇన్నింగ్స్ ఆడితే చూడాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read: Vizag : మూడు నెలల్లో విశాఖకు సీఎం.. వైజాగ్ సౌత్ ముంబై కాబోతుంది.. ఇదే రాజధాని..