Site icon HashtagU Telugu

Rohit Sharma: రోహిత్ శర్మ బ్యాటింగ్ లోనే కాదు.. డ్యాన్స్ లో కూడా ఆదరగొట్టాడు.. వీడియో వైరల్..!

Rohit Sharma

Resizeimagesize (1280 X 720) (3) 11zon

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అతను తన భార్య రితిక, అతని బావమరిది కునాల్ తో కలిసి డ్యాన్స్ చేశాడు. ఈ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘గుడ్ న్యూజ్’ చిత్రంలోని ‘లాల్ ఘఘ్రా’ పాటలో ముగ్గురూ డ్యాన్స్ చేశారు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ స్టైల్‌ని అభిమానులు కామెంట్ల రూపంలో తమ ప్రేమని చూపిస్తున్నారు. ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

ప్రస్తుతం రోహిత్ శర్మ కొన్ని రోజులు టీమ్ ఇండియా నుంచి సెలవు తీసుకున్నాడు. తన భార్య రితికా సోదరుడు కునాల్ వివాహం కోసం అతను ఈ విరామం తీసుకున్నాడు. గత రెండు రోజులుగా రోహిత్ చిత్రాలు వరుసగా బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం బావమరిది పెళ్లిలో హిట్ మ్యాన్ చేసిన డ్యాన్స్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.

బావమరిది పెళ్లి కారణంగా తొలి వన్డే నుంచి రోహిత్ ఔట్

కునాల్ వివాహం కారణంగా ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ టీమిండియాకు దూరమయ్యాడు. అతని స్థానంలో హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో టీమిండియాకు నాయకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సిరీస్‌లోని రెండు, మూడో మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. రేపు అంటే మార్చి 18న రోహిత్ శర్మ టీమ్ ఇండియా జట్టులోకి వస్తాడని విశ్వసనీయ సమాచారం. ఆయన నేరుగా విశాఖపట్నంలో జట్టుతో చేరనున్నారు. భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మార్చి 19న విశాఖపట్నంలో జరగనుంది.