Site icon HashtagU Telugu

Rohit Sharma- Virat Kohli: టీమిండియా అభిమానులకు శుభవార్త.. మూడో టెస్ట్‌కు రోహిత్‌, విరాట్‌?!

BCCI

BCCI

Rohit Sharma- Virat Kohli: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Rohit Sharma- Virat Kohli) అభిమానుల‌కు భారీ శుభ‌వార్త‌. టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయిన ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో కనిపించవచ్చు. ప్రస్తుతం భారత్-ఇంగ్లాండ్ మధ్య రెండవ టెస్ట్ ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతోంది. దీని తర్వాత లార్డ్స్‌లో మూడవ టెస్ట్ జరగనుంది. ఈ టెస్ట్‌కు రోహిత్-విరాట్ హాజ‌ర‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. రోహిత్, విరాట్ లండన్‌లో ఉన్నారని, ఈ మ్యాచ్‌ను చూడటానికి స్టేడియంలో కనిపించవచ్చని వార్తలు వస్తున్నాయి.

రిపోర్టుల ప్రకారం BCCI వారిని లార్డ్స్‌లో జరిగే మూడవ టెస్ట్ మ్యాచ్ చూడటానికి ఆహ్వానించబోతోందని కూడా స‌మాచారం. ఒకవేళ ఈ రిపోర్టులు నిజమైతే రోహిత్-విరాట్ (RO-KO) ఒకే వేదికపై టీమిండియాతో పాటు అభిమానుల‌ను ఉత్సాహ‌ప‌ర‌చ‌నున్నారు. ఈ టూర్‌లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఎందుకంటే సిరీస్ ప్రారంభానికి ముందు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ రెడ్-బాల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కూడా మే 12న టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Also Read: Dalai Lama: దలైలామా జీవితం ఆధారంగా తీసిన సినిమాలు ఇవే!

రోహిత్-విరాట్ టెస్ట్ కెరీర్ ఎలా ఉంది?

విరాట్ కోహ్లీ భారత్ తరపున 123 టెస్ట్ మ్యాచ్‌లలో మొత్తం 9,230 పరుగులు చేశాడు. అతను 10,000 పరుగుల మైలురాయిని చేరుకునే అవ‌కాశం ఉంది. కానీ అంతకు ముందే రిటైర్మెంట్ తీసుకున్నాడు. టెస్ట్‌లలో అతని పేరిట 30 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు, రోహిత్ శర్మ భారత్ తరపున 67 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 4,301 పరుగులు చేశాడు. రోహిత్ బ్యాట్ నుండి 1 డబుల్ సెంచరీ, 12 సెంచరీలు, 18 ఫిఫ్టీలు వచ్చాయి.

ఇంగ్లాండ్ టూర్‌లో విజ‌యానికి ద‌గ్గ‌ర‌గా టీమిండియా

శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న టీమ్ ఇండియా మొదటి టెస్ట్‌లో ఓడిపోయింది. లీడ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ప్రస్తుతం రెండవ టెస్ట్ ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతోంది. ఇందులో భారత్ విజయం సాధించే ఛాన్స్ ఉంది. భారత్ ఇంగ్లాండ్‌కు 608 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చివరి రోజున ఇంగ్లాండ్‌కు 536 పరుగులు చేయాల్సి ఉంది. వారి చేతిలో 7 వికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఛేజ్ దాదాపు అసాధ్యం. ఎందుకంటే టెస్ట్ చరిత్రలో ఐదవ రోజున 500 పరుగులు సాధించిన‌ట్లు చ‌రిత్ర‌లో లేదు.