Rohit Sharma- Virat Kohli: న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత జట్టు సర్వసన్నద్ధమైంది. వడోదరలో జరగనున్న మొదటి వన్డేకు ముందు టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సూపర్ స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు జట్టులో ఉండటం వల్ల తన బాధ్యత ఎంతో సులభమవుతుందని గిల్ కొనియాడారు. దీనికి సంబంధించిన ఐసీసీ సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
రో-కో (Ro-Ko) గురించి కెప్టెన్ గిల్ ఏమన్నారంటే?
వన్డే ఫార్మాట్‌లో టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శన వెనుక రోహిత్, విరాట్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా వీరిద్దరూ జట్టుకు ఎంతో ముఖ్యం. వడోదర వన్డేకు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ మాట్లాడుతూ.. “వారిద్దరిలో ఒకరు (రోహిత్) వన్డే క్రికెట్‌లోనే అత్యుత్తమ ఓపెనర్. ఇక విరాట్ భాయ్ వన్డే చరిత్రలోనే అత్యుత్తమ బ్యాటర్. అటువంటి ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పుడు కెప్టెన్‌గా మా పని చాలా సులభం అవుతుంది” అని పేర్కొన్నారు.
Also Read: అంతర్జాతీయ ఉద్రిక్తతలు నేపథ్యంలో భారత రక్షణ బడ్జెట్ పెరుగుతుందా?
అద్భుతమైన ఫామ్‌లో రోహిత్ – విరాట్
2025 సంవత్సరం నుండి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో పరుగుల వర్షం కురిపిస్తున్నారు. 2026లో కూడా అదే ఫామ్‌ను కొనసాగించాలని వారు పట్టుదలతో ఉన్నారు. ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో వీరిద్దరూ పాల్గొని, చెరో మెరుపు సెంచరీతో సత్తా చాటారు.
వీరిద్దరూ ఫామ్‌లో ఉండటం వల్ల టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ ఎంతో బలంగా కనిపిస్తోంది. ఇది కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లకు పెద్ద ఊరటనిచ్చే అంశం. న్యూజిలాండ్‌తో జరగబోయే ఈ సిరీస్ భారత జట్టుకు అత్యంత కీలకం కానుంది.
