Site icon HashtagU Telugu

T20 World Cup 2024: ద్రవిడ్, రోహిత్ మాస్టర్ ప్లాన్ పాక్ ఆటగాళ్లకు నిద్ర పట్టడం లేదట

T20 World Cup 2024

T20 World Cup 2024

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ ను టీమిండియా విజయంతో ప్రారంభించింది. భారత్ తన తొలి మ్యాచ్‌లోనే ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించింది. కాగా భారత జట్టు జూన్ 9న న్యూయార్క్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది, అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మరియు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాస్టర్ ప్లాన్ పాకిస్థాన్ ఆటగాళ్లకు అంతు చిక్కడం లేదు. అసలు రోహిత్ భయ్యా ప్లాన్ ఏంటంటూ పాకిస్థాన్ ఆటగాళ్లు బిత్తరపోతున్నారట.

వాస్తవానికి బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, సంజూ శాంసన్ తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు. దీని తర్వాత రిషబ్ పంత్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. కానీ ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్ ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు ఓపెనింగ్‌కు వచ్చారు. రిషబ్ పంత్ మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇప్పుడిదే పాకిస్థాన్ ఆటగాళ్లను అయోమయంలో పడేసింది. ఇంతకీ టీమిండియా ఓపెనర్ బ్యాట్స్ మెన్లు ఎవరన్న దానిపై పాక్ బౌలర్లు తలలు పట్టుకుంటున్నారు. రిషబ్ పంత్ ఇంతకుముందు 4 లేదా 5 నంబర్లలో మాత్రమే బ్యాటింగ్ చేసాడు, కానీ చాలా అరుదైన సందర్భాలలో మాత్రమేఆ అతను మూడవ స్థానంలో బ్యాటింగ్ కు వస్తాడు.

వార్మప్ మ్యాచ్‌లోనూ పంత్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఐర్లాండ్‌పై కూడా పంత్ తన ఫామ్ ను కొనసాగించాడు. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆరంభంలోనే ఔట్ అయినప్పుడు, రోహిత్ శర్మతో కలిసి పంత్ జట్టును నడిపించాడు. దీని తర్వాత రోహిత్ గాయం కారణంగా బయటికి వెళ్లగా, రిషబ్ పంత్ గాయ పడినప్పటికీ వెనక్కి తగ్గలేదు. 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 36 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇదిలా ఉంటె టీమ్ ఇండియా జూన్ 9న పాకిస్థాన్‌తో తలపడనుంది, అయితే మూడో స్థానంలో ఉన్న రిషబ్ పంత్ ఫామ్‌ను చూసి ప్రత్యర్థి జట్లకు నిద్ర కూడా పట్టడం లేదట. అటు ఓపెనింగ్ జోడీ కోహ్లీ హా లేక సంజు శాంసన్ హా అర్ధం కాక పాక్ బౌలర్లు తమ ప్రణాళికలను పూర్తిగా మార్చేస్తున్నారట.

Also Read: Parliament Security Breach: నకిలీ ఆధార్ కార్డుతో పార్లమెంటులోకి ప్రవేశించేందుకు ప్రయత్నం