Site icon HashtagU Telugu

Rohit Sharma : రోహిత్ మామూలోడు కాదు.. ద్ర‌విడ్‌కు షాక్‌.. గంగూలీకి ఎస‌రు..

Rohit overtakes Dravid to become Indias fourth leading ODI run scorer

Dravid Rohit

Rohit Sharma : ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో రోహిత్ శ‌ర్మ ఎంత విధ్వంస‌క‌ర ఆట‌గాడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. వ‌న్డేల్లో మూడు సార్లు ద్విశ‌త‌కాలు బాదిన ఏకైక ఆట‌గాడు అత‌డే. గ‌త కొన్నాళ్లుగా హిట్‌మ్యాన్ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవ‌ల జ‌రిగిన టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో దూకుడైన బ్యాటింగ్‌తో అల‌రించిన రోహిత్ ప్ర‌స్తుతం శ్రీలంక‌తో వ‌న్డే సిరీస్‌లోనూ దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. రెండు వ‌న్డేల్లో రెండు అర్థ‌శ‌త‌కాలు బాదాడు.

కొలంబో వేద‌కగా జ‌రిగిన రెండో వ‌న్డేలో రోహిత్ 44 బంతుల‌ను ఎదుర్కొన్నాడు. 5 ఫోర్లు, 4 సిక్స‌ర్లతో 64 ప‌రుగులు చేశాడు. ఈ ప‌రుగుల‌తో రోహిత్ ఓ అరుదైన రికార్డును చేరుకున్నాడు. టీమ్ఇండియా త‌రుపున వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన 4వ ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ క్ర‌మంలో మాజీ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ రికార్డును బ్రేక్ చేశాడు. అంతేకాదండోయ్ మాజీ కెప్టెన్ గంగూలీ రికార్డును బ‌ద్ద‌లు కొట్టేందుకు బ‌ద్ద‌లు కొట్టేందుకు మ‌రెంతో దూరంలో లేడు. మ‌రో 390 ప‌రుగులు చేస్తే గంగూలీ రికార్డును రోహిత్ బ్రేక్ చేస్తాడు.

ద్ర‌విడ్ 340 వ‌న్డేల్లో 10768 ప‌రుగులు చేయ‌గా, రోహిత్ 264 వ‌న్డేల్లో 10831 ప‌రుగులు చేశాడు. ఇక భార‌త్ త‌రుపున వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో స‌చిన్ టెండూల్క‌ర్‌, విరాట్ కోహ్లీలు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. స‌చిన్ 463 వ‌న్డేల్లో 18426 ప‌రుగులు చేయ‌గా, కోహ్లీ 294 వ‌న్డేల్లో 13872 ప‌రుగులు చేశాడు. ఇక గంగూలీ 308 వ‌న్డేల్లో 11221 ప‌రుగుల‌తో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.

టీమ్ఇండియా తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆట‌గాళ్లు వీరే..

* సచిన్ టెండూల్కర్ – 463 వ‌న్డేల్లో 18426 ప‌రుగులు
* విరాట్ కోహ్లీ – 294 వ‌న్డేల్లో 13872 ప‌రుగులు
* సౌరవ్ గంగూలీ – 308 వ‌న్డేల్లో 11221 ప‌రుగులు
* రోహిత్ శర్మ – 264 వ‌న్డేల్లో 10831 ప‌రుగులు
* రాహుల్ ద్రవిడ్ – 340 వ‌న్డేల్లో 10768 ప‌రుగులు
* ఎంఎస్ ధోని – 347 వ‌న్డేల్లో 10599 ప‌రుగులు