Rohit-Kohli: భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20, టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ లో ఆడాలనే కోరిక ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియా లో అక్టోబర్ నెలలో జరగనున్న వన్డే సిరీస్ వారి చివరి అంతర్జాతీయ గేమ్స్ కావచ్చు.
బీసీసీఐ కొత్త వ్యూహం ప్రకారం, వన్డేలో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అందుకే రోహిత్, కోహ్లీ వంటి సీనియర్ ప్లేయర్స్ ఆస్ట్రేలియా పర్యటన తర్వాత ఇంకా ఆడాలంటే, డిసెంబర్ లో జరిగే దేశీయ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనాల్సి ఉంటుంది.
కోహ్లీ, రోహిత్ గతంలో టెస్ట్, ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఫామ్ బాగా లేకపోవడం, తాజాగా వారిద్దరూ వన్డే ఫార్మాట్‌లో కూడా పరిమితి గడపవచ్చు అన్న ఊహించదగ్గ విషయాలు ఉన్నాయి.
రోహిత్ 273 వన్డేలు, 11186 పరుగులు, 32 సెంచరీలు చేశాడు. విరాట్ 302 వన్డేలు, 14181 పరుగులు, 51 సెంచరీలు చేశాడు. వీరికి బీసీసీఐ ముందస్తుగా రిటైర్‌మెంట్ షరతులు విధించవచ్చు.