Site icon HashtagU Telugu

Rohit- Gambhir: టీమిండియాలో మ‌రోసారి విభేదాలు.. రోహిత్‌, గంభీర్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు?

India Injury Worries

India Injury Worries

Rohit- Gambhir: ఛాంపియన్స్ ట్రోఫీకి 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు. శనివారం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit- Gambhir) కలిసి జట్టును ప్రకటించారు. తన చివరి ఐదు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో మూడు సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఈ జట్టులో శాంసన్‌ను కూడా చేర్చుకోవాలని భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కోరుకున్నారు. అయితే రోహిత్- అగార్కర్.. రిషబ్ పంత్‌కు వికెట్ కీపర్‌గా జట్టులో చోటు కల్పించారు.

ఒక నివేదిక ప్రకారం.. గంభీర్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్‌గా చేయాలని కోరుకున్నాడు. అయితే రోహిత్-అగార్కర్ ద్వయం ఈ నిర్ణయాన్ని విస్మరించి వైస్ కెప్టెన్సీని గిల్‌కు అప్పగించారు. ఈ విధంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం జట్టు ఎంపికకు సంబంధించి గంభీర్ తీసుకున్న రెండు ప్రధాన నిర్ణయాలను బీసీసీఐ ప‌ట్టించుకోలేదు. జట్టు ప్రకటనకు ముందు గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, అగార్కర్ మధ్య సుదీర్ఘ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది.

Also Read: RRB ALP Result: ఆర్ఆర్‌బీ లోకో పైల‌ట్ ఫ‌లితాలు.. ఎలా చెక్ చేసుకోవాలంటే?

బుమ్రా గాయంపై అగార్కర్ స్పంద‌న ఇదే?

ఇదిలావుండగా ఇంగ్లండ్‌తో జరిగే మొదటి రెండు వన్డేలకు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌గా లేడని, అతని స్థానంలో హర్షిత్ రాణాను నియమించాలని చీఫ్ సెలెక్టర్ అగార్కర్ శనివారం పేర్కొన్నారు. అయితే ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు బుమ్రా ఎంపిక కాలేదు. ఈ పేసర్ ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టులో ఎంపికయ్యాడు.

బుమ్రా ఆసీస్ ప‌ర్య‌ట‌న‌లో గాయపడ్డాడు

ఐదు వారాల పాటు మైదానానికి దూరంగా ఉండాలని బుమ్రాను కోరామని, ఇంగ్లండ్‌తో జరిగే మొదటి రెండు వన్డేలకు అతడు అందుబాటులో ఉండడని అగార్కర్ అన్నాడు. మేము అతని ఫిట్‌నెస్ కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఫిబ్రవరి ప్రారంభంలో వైద్య బృందం నుండి అతని పరిస్థితి గురించి తెలుస్తుంది. ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఐదో టెస్టులో బుమ్రా గాయపడ్డాడు. అతను మూడవ రోజున వెన్నునొప్పి స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డ్డాడు. దీని కారణంగా అతను ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ ఇన్నింగ్స్‌లో ఎక్కువ బౌలింగ్ చేయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది.