Site icon HashtagU Telugu

Rohit Sharma: చెన్నై కెప్టెన్ గా రోహిత్ ?

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma: వచ్చే ఎడిషన్ ఐపీఎల్ సమయానికి రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తే చూడాలని ఉందన్నాడు చెన్నై మాజీ ఆటగాడు అంబటి రాయుడు. ఎంఎస్ ధోని రిటైర్మెంట్ సమయానికి రోహిత్ చెన్నైకి నాయకత్వం వహించాలని అంబటి రాయుడు కోరుకుంటున్నానని చెప్పాడు.

5 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ముంబై జట్టు హార్దిక్ నేతృత్వంలో బరిలోకి దిగుతుండగా రోహిత్ హార్దిక్ డైరెక్షన్ లో ఆడనున్నాడు. అయితే రోహిత్ మరో 5-6 సంవత్సరాలు ఐపీఎల్ లో రాణించగలడు. సో.. సమీప భవిష్యత్తులో అతను చెన్నై కోసం ఆడితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు రాయుడు. కెప్టెన్‌గా రోహిత్ ఏ ఫార్మెట్లోననైన రాణిస్తాడని చెప్పాడు. మాహి ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటించే సమయానికి జట్టు బాధ్యతలు రోహిత్ తీసుకుంటే చూడాలని ఉందని చెప్పాడు.

ముంబై ఇండియన్స్‌తో కెరీర్‌ను ప్రారంభించన పాండ్యా, 2022 సీజన్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్‌తో జతకట్టాడు. ఆ జట్టును హార్దిక్ ఛాంపియన్ గా నిలబెట్టి ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టాడు. అంతేకాదు గత ఎడిషన్ లో గుజరాత్ ను ఫైనల్ కు చేర్చాడు. అయితే 2024 సీజన్‌కు ముందు హార్దిక్ సొంతగూటికి వచ్చి ముంబైకి కెప్టెన్ అయ్యాడు.ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్‌కు నాయకత్వం వహించడం పాండ్యాకు సవాలుగా మారగలదని రాయుడు అభిప్రాయపడ్డాడు. గుజరాత్ టైటాన్స్ జట్టులో చాలా మంది స్టార్ ప్లేయర్‌లు ఉన్నారు కాబట్టి జట్టు ఫైనల్ కు చేరింది. కానీ ముంబై పరిస్థితి వేరు. ఈ నేపథ్యంలో ముంబైకి కెప్టెన్‌గా ఉండటం సులభం కాదు. చాలా ఒత్తిడి ఉండొచ్చు. అందరు కెప్టెన్లు ఆ ఒత్తిడిని తట్టుకోవడం కష్టం. సో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ముంబై కి కష్టాలు తప్పవని, కెప్టెన్ ను మార్చి ముంబై ఇండియన్స్ చాలా పెద్ద తప్పు చేసిందని చెప్పాడు అంబటి.

Also Read: CAA : సీఏఏ నోటిఫికేషన్ తర్వాత బీహార్ జిల్లాల్లో అలర్ట్

Exit mobile version