GT vs CSK: CSK జెర్సీ ధరించినందుకు ట్రోల్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 క్వాలిఫైయర్ 1లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మద్దతు ఇచ్చినందుకు ట్రోల్ కి గురైన భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప తాజాగా ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

GT vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 క్వాలిఫైయర్ 1లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మద్దతు ఇచ్చినందుకు ట్రోల్ కి గురైన భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప తాజాగా కూల్ గా రియాక్ట్ అయ్యారు. మే 23 మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్‌ను ఓడించిన తర్వాత సిఎస్కె జెర్సీని ధరించి తన కొడుకుతో ఉన్న ఫోటోను ఉతప్ప పోస్ట్ చేశాడు. ఉతప్ప ఆ ఫోటోను ట్విటర్‌లో పోస్ట్ చేసి లెట్స్ గో సీఎస్‌కే అని క్యాప్షన్ పెట్టాడు. దీంతో రాబిన్ ఉతప్పపై ట్రోల్స్ మొదలయ్యాయి. మాజీ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మద్దతు ఇవ్వని ఉతప్ప ఎల్లో ఆర్మీకి సపోర్ట్ చేయడం చర్చనీయాంశమైంది. నిజానికి ఉతప్ప గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కి సారధ్యం వహించారు.

ఇక ఉతప్పపై వస్తున్న ట్రోల్స్ పై ఆయన స్పందిస్తూ… నాపై ట్రోల్స్ రావడం నాకేం ఆశ్చర్యంగా లేదని, విధేయత రెండు మార్గాలు అంటూ చెప్పుకొచ్చాడు. గౌరవం రెండు వైపుల నుండి ఇవ్వడం మరియు తీసుకోవడం లాంటిదని తెలిపారు. ఇదిలా ఉండగా 2014లో ఉతప్ప ఐపీఎల్‌లో అత్యుత్తమ సీజన్‌గా నిలిచాడు. ఈ సమయంలో అతను కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున 41.33 సగటుతో 660 పరుగులతో జట్టులో అత్యధిక పరుగుల స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత ఐపీఎల్‌లో మరో మూడేళ్లు ఆడాడు. మొదట 2020లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతూ, రిటైర్ కావడానికి ముందు 2021 మరియు 2022లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు.

Read More: GT vs CSK: ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్… చెపాక్ లో గుజరాత్ కు చెక్