Site icon HashtagU Telugu

Mohammad Rizwan: మహ్మద్ రిజ్వాన్ ప్రపంచ రికార్డు, కోహ్లీ బాబర్ రికార్డ్ బద్దలు

Mohammad Rizwan

Mohammad Rizwan

Mohammad Rizwan: న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి, స్వదేశీయుడు బాబర్ ఆజం రికార్డులను బద్దలు కొట్టాడు. రిజ్వాన్ న్యూజిలాండ్‌పై 45 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 3000 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

రావల్పిండిలో జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో 31 ఏళ్ల రిజ్వాన్ 34 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో అజేయంగా 45 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ విజయం సాధించడం ద్వారా ఐదు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. మహ్మద్ రిజ్వాన్ తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో 79వ ఇన్నింగ్స్‌లో మూడు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. కాగా రెండు ఇన్నింగ్స్‌ల తేడాతో బాబర్‌ ఆజం, విరాట్‌ కోహ్లీలను అధిగమించాడు. బాబర్ మరియు విరాట్ ఇద్దరూ 81వ ఇన్నింగ్స్‌లో మూడు వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు. అయితే టి20 అంతర్జాతీయ క్రికెట్‌లో 3000 పరుగులు చేసిన ఎనిమిదో ఆటగాడిగా నిలిచాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ. కోహ్లీ 117 మ్యాచ్‌ల్లో 4037 పరుగులు చేశాడు.

We’re now on WhatsApp : Click to Join

మ్యాచ్ విషయానికి వస్తే.. పాకిస్థాన్ 47 బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 18.1 ఓవర్లలో 90 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో పాకిస్థాన్ 12.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఈ రోజు ఆదివారం రావల్పిండి వేదికగా జరగనుంది.

Also Read: GT vs PBKS: ప్లేఆఫ్‌ కోసం పోటీ పడుతున్న పంజాబ్ – గుజరాత్