Riyan Parag Record : ఐపీఎల్ 17వ సీజన్ కు ముందు పలువురు యువక్రికెటర్లు దుమ్మురేపుతున్నారు. తమ సత్తా చూపేందుకు రంజీ ట్రోఫీ మ్యాచ్ లను వేదికలుగా చేసుకుంటున్నారు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ రియాన్ పరాగ్ (Riyan Parag) మెరుపు ఇన్నింగ్స్ తో విరుచుకుపడ్డాడు. అస్సాం కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఈ యువక్రికెటర్ ఛత్తీస్ గడ్ తో జరుగుతున్న మ్యాచ్ లో సుడిగాలి బ్యాటింగ్ తో రెచ్చిపోయాడు. కేవలం 56 బంతుల్లోనే శతకం బాదేశాడు. రంజీ చరిత్రలో ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. క్రీజులోకి వచ్చీరావడంతోనే బౌండరీలతో ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్నాడు.
We’re now on WhatsApp. Click to Join.
రియాన్ పరాగ్ (Riyan Parag) ఆడిన ఈ ఇన్నింగ్స్ ఖచ్చితంగా అందరికీ గుర్తిండిపోతుంది. ఎందుకంటే జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆదుకున్నాడు. గత ఐపీఎల్ సీజన్ లో పెద్దగా రాణించని రియాన్ ఈ సారి దేశవాళీ క్రికెట్ లో ఫామ్ కనబరుస్తున్నాడు. రంజీల్లో ఇలాంటి మెరుపు ఇన్నింగ్స్ ఆడడం అరుదుగా చూస్తుంటాం. బౌండరీలు, సిక్సర్లు పోటాపోటీగా బాదేసిన రియాన్ పరాగ్ 87 బంతుల్లో 155 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 12 సిక్సర్లున్నాయి. రియాన్ మెరుపు ఇన్నింగ్స్ తో అస్సాం ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోగలిగింది. కాగా ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న రియాన్ పరాగ్ పలు కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. ఇప్పటి వరకూ 54 మ్యాచ్ లలో 600 పరుగులు చేాశాడు. జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న ఈ యువక్రికెటర్ వచ్చే ఐపీఎల్ సీజన్ తో మెరుపులు మెరిపించేందుకు సిద్ధమవుతున్నాడు.
Also Read: 2024 – Career Options : 2024లో మీ జీవితం మార్చే టాప్-5 కెరీర్ ఆప్షన్స్