Rishabh Pant: ఐపీఎల్ 2024లో ఇంపాక్ట్ ప్లేయర్ గా రిషబ్ పంత్..?

గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నుంచి భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) టీమ్ ఇండియాకు దూరమైన సంగతి తెలిసిందే.

  • Written By:
  • Publish Date - December 11, 2023 / 09:40 PM IST

Rishabh Pant: గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నుంచి భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్
(Rishabh Pant) టీమ్ ఇండియాకు దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు పంత్ తిరిగి రావడంపై ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి కారణం పంత్ శిక్షణ ప్రారంభించడం, తన శిక్షణకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో తరచుగా పంచుకోవటమే ముఖ్య కారణం. IPL 2024 టోర్నమెంట్‌లో పంత్ పునరాగమనం గురించి నివేదికలు అందుతున్నాయి.

పంత్ కెప్టెన్ కాదా..?

వాస్తవానికి కొన్ని మీడియా నివేదికలను ఉటంకిస్తూ రిషబ్ పంత్ IPL 2024లో పునరాగమనం చేస్తాడని పేర్కొన్నాయి. అయితే పంత్ ఇంకా వికెట్ కీపింగ్‌కు సిద్ధంగా లేడు. అందుకే జట్టు అతనిని సీజన్ అంతటా ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉపయోగించుకోవచ్చు అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పంత్ పూర్తి సభ్యునిగా జట్టుతో ఉండకపోతే కెప్టెన్‌గా కూడా ఉండలేడనే ప్రశ్న తలెత్తుతుంది.

Also Read: Indian Cricketers: ఈ ఏడాది పెళ్లి చేసుకున్న టీమిండియా ఆటగాళ్లు ఎవరంటే..?

పంత్ గైర్హాజరీలో డేవిడ్ వార్నర్ గత సీజన్‌లో జట్టుకు నాయకత్వం వహించాడు. కానీ జట్టు ప్రదర్శన పేలవంగా ఉంది. అందుకే ఈసారి పంత్ కెప్టెన్సీ చేయకపోతే వార్నర్ కెప్టెన్సీ చేస్తాడనే ప్రశ్న తలెత్తుతోంది. లేదా జట్టు కొత్త కెప్టెన్ కోసం వెతకాల్సి ఉంటుంది. ఇది మాత్రమే కాదు IPL అప్‌డేట్ కారణంగా పంత్ భారత జట్టులోకి తిరిగి రావడంపై కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తాయి.

పంత్.. టీ20 ప్రపంచకప్ ఆడగలడా?

జూన్ 2024లో అంటే IPL ముగిసిన వెంటనే T20 ప్రపంచ కప్ ఆడాల్సి ఉంది. ఈ టోర్నీకి వెస్టిండీస్, అమెరికా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. దీనికి ముందు ఐపిఎల్ సన్నద్ధతకు గొప్ప అవకాశంగా ఉపయోగించుకోవచ్చు. అయితే రిషబ్ పంత్ ఐపీఎల్‌లో వికెట్ కీపింగ్ చేయకుండా కేవలం బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే ఆడితే టీ20 ప్రపంచకప్‌లో అతను ఆడడంపై ఉత్కంఠ ఉండనుంది. ఎందుకంటే IPLలో పంత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడగలడు. కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో అలాంటి నియమం లేదు. అందుకే ఇప్పుడు అతను అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడంపై ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇంతకుముందు ఇంగ్లండ్ సిరీస్ వరకు పంత్ తిరిగి రాగలడని భావించారు. కానీ దీని గురించి ఎటువంటి సమాచారం లేదు.

We’re now on WhatsApp. Click to Join.