Site icon HashtagU Telugu

Rishabh Pant: రిషభ్ పంత్ సెంచరీ సంచలనం.. ధోనీ రికార్డు బద్దలు, ఇంగ్లాండ్‌పై మెరుపులు

Rishabh Pant

Rishabh Pant

Rishabh Pant: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత యువ వికెట్ కీపర్‌ బ్యాటర్ రిషభ్ పంత్‌ తన శైలిలో చెలరేగి శతకం నమోదు చేశాడు. 65 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన పంత్, అదే దూకుడుతో బ్యాటింగ్ కొనసాగించాడు. బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించిన పంత్, 99 పరుగుల వద్ద భారీ సిక్స్‌తో తన టెస్టు కెరీర్‌లో ఏడో సెంచరీ పూర్తి చేశాడు. ఈ శతకం ద్వారా పంత్ భారత టెస్టు చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్‌గా మహేంద్రసింగ్ ధోనీని అధిగమించాడు. ధోనీ జత చేసిన ఆరు సెంచరీల రికార్డును పంత్ తలకిందలు చేశాడు. ఇక వృద్ధిమాన్ సాహా మూడు సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు.

Kaushik Reddy : ఎంజీఎం ఆస్పత్రికి ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తరలింపు

పంత్ సాధించిన ఏడు టెస్టు సెంచరీల్లో ఐదు శతకాలు విదేశాల్లోనే రావడం విశేషం. ది ఓవల్, సిడ్నీ, కేప్‌టౌన్, బర్మింగ్‌హామ్, లీడ్స్ మైదానాల్లో అతడు అద్భుత సెంచరీలు నమోదు చేశాడు. మిగిలిన రెండు శతకాల్లో ఒకటి అహ్మదాబాద్‌లో, మరొకటి చెన్నై వేదికగా నమోదయ్యాయి. పంత్ చేసిన బ్యాటింగ్‌తో భారత జట్టు భారీ స్కోర్ దిశగా పయనించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 209 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. గిల్ 127 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించి 147 పరుగుల వద్ద వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన కరుణ్ నాయర్ మాత్రం ఒక్క పరుగూ చేయకుండానే పెవిలియన్ చేరాడు.

శతకం సాధించిన అనంతరం పంత్ తనదైన శైలిలో సంబరాలు చేసుకున్నాడు. ఒక్కసారి కాదు, రెండు మూడు సార్లు బ్యాట్ ఊపి ఆనందం వ్యక్తం చేశాడు. ఇదంతా చూసిన అభిమానులు సైతం సంబరాల్లో మునిగిపోయారు. ఇది రిషభ్ పంత్ ప్రతిభకు మరోసారి ముద్ర వేస్తున్న ప్రదర్శనగా నిలిచింది.

గతేడాది ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ టెస్టులో నిర్లక్ష్యంగా వికెట్ ఇస్తూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పంత్, అప్పట్లో టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ నుండి “స్టుపిడ్, స్టుపిడ్, స్టుపిడ్!” అనే వ్యాఖ్యలు కూడా విన్నాడు. తన షాట్ ఎంపికపై గావస్కర్ తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో అప్పట్లో పంత్ పెద్ద దుమారానికి లోనయ్యాడు. కానీ ఇప్పుడు అదే పంత్, కూల్‌గా ఆడి, జట్టు పరిస్థితులకు తగ్గట్టు వ్యవహరించి శతకంతో విమర్శకుల నోరులా మూసేశాడు. ఒక వేళ ఆటలో స్థిరత ఉండకపోతే అతడి దూకుడు ప్రమాదమే అయి ఉండేదన్న సంగతి తెలిసిన పంత్, ఈసారి ఆ లోపం లేకుండా బ్యాటింగ్‌ చేశాడు. అది పంత్ కెరీర్‌లో ఓ ముఖ్యమైన మలుపుగా మారింది. “స్టుపిడ్” అన్నవారే ఇప్పుడు అతడి చైతన్యం చూస్తూ “సూపర్” అనే దాకా తీసుకొచ్చాడు.

Modi Praise Nara Lokesh : నారా లోకేష్ పై మోడీ ప్రశంసల జల్లు

Exit mobile version