Site icon HashtagU Telugu

Rishabh Pant: టీమిండియాకు బ్యాడ్ న్యూస్‌.. నాల్గ‌వ టెస్ట్‌కు పంత్ దూరం?!

Rishabh Pant

Rishabh Pant

Rishabh Pant: ఇంగ్లాండ్‌తో ఈనెల 23 నుంచి జ‌ర‌గ‌బోయే నాల్గ‌వ టెస్ట్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలే అవ‌కాశం ఉంది. రిషభ్ పంత్ (Rishabh Pant) వికెట్ కీపింగ్‌కు సిద్ధంగా లేకుంటే అతను ఇంగ్లండ్‌తో జరిగే నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో ఆడకూడదని మాజీ భారత హెడ్ కోచ్ రవి శాస్త్రి అన్నారు. నాల్గవ టెస్ట్ మ్యాచ్ జూలై 23 నుండి మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో జరగనుంది. మూడవ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు పంత్ వేలికి గాయం కావడంతో ఆ మ్యాచ్‌లో మిగిలిన రోజుల్లో అతను వికెట్ కీపింగ్ చేయలేకపోయాడు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేశాడు.

గాయం మరింత తీవ్రం కావచ్చు

ఈ విష‌యంపై రవి శాస్త్రి మాట్లాడుతూ.. పంత్ నాల్గవ టెస్ట్ ఆడితే అతని గాయం మరింత తీవ్రం కావచ్చని అన్నారు. భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషెట్.. పంత్ తన అద్భుతమైన ఫామ్‌ను దృష్టిలో ఉంచుకుని నాల్గవ టెస్ట్‌లో బ్యాట్స్‌మన్‌గా ఆడవచ్చని వెల్లడించాడు. అయితే ఈ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ విశ్రాంతి తీసుకొని, ఓవల్‌లో జరిగే చివరి టెస్ట్ కోసం సిద్ధం కావాలని శాస్త్రి అభిప్రాయపడ్డాడు.

Also Read: Pawan Kalyan: జ‌న‌సేనాని కీల‌క నిర్ణ‌యం.. కూట‌మిలో టీడీపీ ఆధిపత్యానికి చెక్?!

ర‌విశాస్త్రి మ‌రింత మాట్లాడుతూ.. పంత్‌ ఫీల్డ్‌లో ఉండాల్సి ఉంటుంది. ఫీల్డింగ్ చేస్తే పరిస్థితి మరింత దిగజారవచ్చు. గ్లోవ్స్‌తో కనీసం కొంత రక్షణ ఉంటుంది. గ్లోవ్స్ లేకుండా వేలికి ఏదైనా తగిలితే అది మంచిది కాదు. దీనివల్ల గాయం మరింత తీవ్రమవుతుంది. అతను వికెట్ కీపింగ్, బ్యాటింగ్ రెండూ చేయాలి. రెండింటిలో ఒక్కటి మాత్రమే చేయలేడు. ఒకవేళ ఫ్రాక్చర్ ఉంటే అతను విశ్రాంతి తీసుకొని ఓవల్ కోసం సిద్ధం కావాలి. లేకపోతే అతనికి సుమారు తొమ్మిది రోజుల సమయం ఉంది కోలుకోవడానికి అని అన్నారు.

అద్భుత ఫామ్‌లో పంత్

ప్ర‌స్తుత సిరీస్‌లో రిషభ్ పంత్ బ్యాట్ అద్భుతంగా పరుగులు సాధిస్తోంది. లీడ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో పంత్ శతకాలు సాధించి చరిత్ర సృష్టించాడు.