N Jagadeesan: భారత టెస్ట్ జట్టు ఉప కెప్టెన్ రిషబ్ పంత్ ఐదవ టెస్ట్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. మాంచెస్టర్ టెస్ట్ సమయంలో కాలి బొటనవేలికి గాయం కావడంతో పంత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌లో ఇప్పుడు చివరి మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ కీలక మ్యాచ్ కోసం పంత్ స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నారాయణ్ జగదీశన్‌ను (N Jagadeesan) భారత స్క్వాడ్‌లోకి తీసుకున్నారు.
నారాయణ్ జగదీశన్ ఎవరు?
రిషబ్ పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన నారాయణ్ జగదీశన్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. జగదీశన్ 52 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 47.50 సగటుతో 3,373 పరుగులు సాధించాడు. అతని ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో 10 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. రిషబ్ పంత్ దూరమవ్వడంతో జగదీశన్‌కు ఇంగ్లాండ్‌తో జరిగే ఐదవ టెస్ట్‌లో భారత జట్టు తరఫున అరంగేట్రం చేసే అవకాశం లభించవచ్చు.
Also Read: New UPI Rules: యూపీఐ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ఆగస్టు నుంచి కీలక మార్పులీవే!
భారత జట్టు ముందున్న ఎంపికలు
రిషబ్ పంత్ గాయం భారత ఆడే జట్టు కూర్పుపై ప్రభావం చూపనుంది. నాల్గవ టెస్ట్‌లో పంత్ రిటైర్డ్ హర్ట్ అయిన తర్వాత అతని స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ చేయడానికి వచ్చాడు. అయితే, ఐసీసీ కొత్త నియమాల ప్రకారం బ్యాట్స్‌మెన్‌కు తలకు గాయం తగిలినప్పుడు మాత్రమే బ్యాట్స్‌మెన్‌ను రీప్లేస్ చేయవచ్చ. కాబట్టి, పంత్ కాలి బొటనవేలికి గాయం కావడంతో జురెల్‌కు బ్యాటింగ్ చేయడానికి అనుమతి లభించలేదు.
ఐదవ టెస్ట్ కోసం రిషబ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ ఆడే జట్టులోకి రావడానికి బలమైన అవకాశం ఉంది. అదే సమయంలో ఇప్పుడు నారాయణ్ జగదీశన్ కూడా ఒక ఎంపికగా ఉన్నాడు. ఒకవేళ జగదీశన్‌కు అవకాశం లభిస్తే, అతను తన అంతర్జాతీయ టెస్ట్ అరంగేట్రం చేయవచ్చు. జట్టు మేనేజ్‌మెంట్ చివర టెస్ట్‌కు జట్టును ఎలా ఎంపిక చేస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.